Cpm not committed to tdp

CPM not committed to TDP,Left parties met,CPM not for Telengana,Telugu Desam Party, Communist Party of India, CPI(M) or CPM

CPM not committed to TDP

CPM.gif

Posted: 02/06/2012 01:51 PM IST
Cpm not committed to tdp

CPM not committed to TDPరాష్ట్రంలో  త్వరలో జరగనున్న  ఉప ఎన్నికల్లో  సీపీఎం  ఒంటరిగా  పోటీ చేసేందుకు  సిద్దమవుతోంది.  ఈ ఎన్నికల ద్వారా  తమ బలాన్ని  అంచనా  వేసుకునేందుకు  గెలుపోములతో  నిమిత్తం  లేకుండా  కొన్ని  నియోజకవర్గాలలో  స్వతంత్రంగా  పోటీ చేయాలని  ఆ పార్టీ  నిర్ణయించింది.  పార్టీకి  బలమున్నచోట్ల సీపీఎం  అభ్యర్థులు  నేరుగా బరిలోకి దిగుతారు.  మిగిలిన  నియోజకవర్గాల్లో  ఇతర  వామపక్ష  పార్టీలతో  చర్చించి  ఉమ్మడిగా  సీట్ల  సర్థుబాటు  చేసుకోవాలని  ఆ పార్టీ  రాష్ట్ర నాయకత్వం  భావిస్తోంది.  ఈ ప్రక్రియను ఉప ఎన్నికలు  ప్రకటించిన తర్వాతే  ప్రారంభించాలని  నిర్ణయించుకుంది.  మరోవైపు  ప్రజల  సమస్యలను  ఉమ్మడి  కార్యాచరణ  రూపొందించి  పోరాటాలను వేగం పెంచాలని  సీపీఎం  యోచిస్తోంది.  తెలంగాణ తదితర  అంశాల  విషయంలో  సీపీఐతో  సిద్దాంతపరమైన  వైరుధ్యాలున్నప్పటికి , వాటిని పక్కనబెట్టి  ఆ పార్టీతో  కలిసి  పనిచేసేందుకు  మార్క్సిస్టులు  సిద్దమవుతున్నారు.  ఇదే  పంథాను అనుసరించాలని  సీపీఎం  నిర్ణయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cuban blogger says government bars trip to braz
Sunrise for children  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles