Ap congress denies ias officers being made scapegoats

AP Congress denies IAS officers being made scapegoats, IAS officers expressing ,firing CBI probe, A.P. IAS Officers

AP Congress denies IAS officers being made scapegoats

AP.gif

Posted: 02/06/2012 10:48 AM IST
Ap congress denies ias officers being made scapegoats

సిబిఐపై ఐఏఎస్‌ల ఆందోళన తాజాగా అమాత్యుల వైపు తిరిగింది. మంత్రులు చెప్పినట్టే తాము నడుచుకుంటున్నాం తప్ప, తమ తప్పేమీ లేదంటూ ఐఏఎస్ అధికార్ల సర్వసభ్య సమావేశం వ్యక్తం చేసిన అభిప్రాయం వివాదమై కొత్తమలుపు తిరిగింది. తాజా పరిణామాల్లో ఐఏఎస్‌లు, మంత్రులు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. సిబిఐ దర్యాప్తుతో ఇప్పటికే పడకేసిన పాలన రానున్న రోజుల్లో మరిన్ని విపరీత పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్నటి వరకు సిబిఐ, మంత్రులపై ఐఏఎస్‌లు వాగ్బాణాలు సంధించగా, ఇప్పుడు మంత్రులు, రాజకీయ నేతలు కూడా ఐఏఎస్‌లపై ఎదురుదాడికి దిగుతున్నారు.

తమపై ఆరోపణలు చేసే బదులు తప్పు చేసిన, అధికారులను ఒత్తిడి చేస్తున్న మంత్రుల పేర్లు బయటకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ విచారణ సక్రమంగా లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న అధికారుల తీరును ప్రశ్నిస్తూనే, తప్పు చేసినట్టు భావిస్తున్న మంత్రుల పేర్లు విచారణలో వెల్లడించవచ్చుకదా! అని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద సిబిఐ, ఐఏఎస్‌లు, మంత్రుల మధ్య తలెత్తిన వివాదం పాలనపై పెను ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఫైళ్లు పెండింగ్‌లో పడిపోతున్నాయి.

సిబిఐ విచారణలో తమకు అన్యాయం జరుగుతోందంటూ ఐఏఎస్‌లు గళం విప్పగా, మంత్రులు కూడా వివిధ ప్రాంతాల్లో దీటుగానే స్పందించారు. నిజంగా వారిని మంత్రులు ఒత్తిడి చేస్తే అలాంటి వాళ్ల వివరాలు బహిర్గతం చేయడంతోపాటు, సిబిఐ ముందు కూడా వివరించవచ్చు కదా? అని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన ఐఏఎస్‌లు ప్రభుత్వ ప్రతిష్టను కాపాడడం కోసమే సిబిఐ ముందు వౌనం దాలుస్తున్నట్టు ఐఏఎస్ అధికారుల సంఘ ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆదివారం రాష్టవ్య్రాప్తంగా ఇదే అంశంపై అటు ఐఏఎస్‌ల నుంచి, ఇటు మంత్రుల నుంచి చర్చ తారాస్థాయికి చేరుకుంది. మధ్య సిబిఐ మాత్రం రెండువర్గాల మధ్య రాజుకుంటున్న వివాదాన్ని పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతోంది. సిబిఐ విచారణ, దారి తీసిన పరిస్థితులపై అటు ఛానళ్లలో, ఇటు ప్రజావేదికలపైనా, మరికొంతమంది మీడియా ముందుకు వచ్చిన ఐఏఎస్, మంత్రులు తమతమ మనోభావాలు వెల్లడించారు.
మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ఈ వివాదంపై స్పందిస్తూ విచారణ పూర్తికాకుండానే అధికారుల్లో ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. ఒక ఫైలు తయారు కావాలంటే ఉద్యోగులు, అధికారులే తయారు చేస్తారని, చివరి దశలోనే తమ వద్దకు ఫైలు వస్తుందని, అలాంటప్పుడు తమది బాధ్యత అని ఎలా అంటారని ప్రశ్నించారు. అధికారులంతా అవినీతిపరులని చెప్పలేనని, అయితే కొంతమంది వల్ల వ్యవస్థ భ్రష్టుపడుతోందని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Britan rani hand bag checking
Priyanka gandhi hits out at up chief  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles