Acb raids liquor syndicates excise officials across state

ACB raids liquor syndicates, Excise officials across State,Shock in the ACB,

ACB raids liquor syndicates, Excise officials across State

ACB.gif

Posted: 01/30/2012 12:16 PM IST
Acb raids liquor syndicates excise officials across state

రాష్టవ్య్రాప్తంగా ఎక్సైజ్ శాఖలో మద్యం వాసనకన్నా అవినీతి కంపు ఎక్కువైంది. సిండికేట్లుతో చేతులు కలిపిన ఎక్సైజ్ అధికారుల వ్యాపారంలో వాటాలు పెడుతూనే, ప్రాంతాలవారీ ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, అధికారులు స్వీకరిస్తున్న ముడుపుల వ్యవహారం కోట్లలోనే టర్నోవర్ సాగుతోంది. తాజాగా అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) చేపట్టిన విచారణలో కళ్ళు బైర్లుగమ్మే నిజాలు వెల్లడయ్యాయి. వీటినిచూసి ఎసిబి సైతం విస్మయానికి గురైంది. చాలా ప్రభుత్వ శాఖల్లో లంచాలు తీసుకుని అవతలి వారికి సహకరించడం, లేదంటే ఆ సొమ్ముతో రియల్‌ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం, ఇంకా కావాలంటే ఇళ్ళు, పొలాలు కొనడం అన్నది మామూలే. కానీ ఎక్సైజ్ శాఖలో సిబ్బంది, అధికారులు ఎవరి దగ్గరైతే లంచాలు తీసుకుంటున్నారో వారికే లంచాల సొమ్మును పెట్టుబడులుగా పెడుతున్నారు. మద్యం సిండికేట్లకు ముందు పెట్టుబడులు పెట్టడం, తర్వాత వారి నుంచే లంచాలు తీసుకోవడం అన్నది చాలా జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు అనుసరిస్తున్న విధానం.

ఎసిబి తాజాగా జరిపిన సోదాల్లో ఈ గుట్టు రట్టయ్యింది. ఎక్సైజ్ శాఖలో పనిచేసే ఒక హెడ్ కానిస్టేబుల్ ఏకంగా రూ.53 లక్షలు ఒక సిండికేట్ లీడర్‌కు వడ్డీ చెల్లించే ప్రాతిపదికపై పెట్టుబడి పెట్టాడంటే ఇక ఉన్నతాధికార్లు ఇంకెంత పెట్టుబడులు పెట్టివుంటారో ఆలోచిస్తే, ఈ శాఖలో అవినీతి ఏస్థాయిలో పాతుకుపోయిందో స్పష్టమవుతోంది. మద్యం వ్యాపారుల నుంచి లంచాలు తీసుకోవడం ఆ సొమ్మును మళ్లీ వాళ్లకే ఫైనాన్స్ చేస్తూ రెండు కాదు నాలుగు చేతులా సంపాదిస్తున్న ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది బండారం ఎసిబి దాడులతో బట్టబయలైంది. ఒక జిల్లాలో కొంతమంది ఎక్సైజ్ అధికారులు ఒక సిండికేట్ నేతకు రూ.2.44 కోట్లు గత ఏడాది ఫైనాన్స్ చేశారు. మరో జిల్లాల్లో ఒక సిండికేట్ నాయకుడు ఒక ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ చేసిన ఫైనాన్స్‌కు వడ్డీ, అసలు కలిపి రూ.22 లక్షలు తిరిగి చెల్లించారు.

అలాగే ఒక ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.10 లక్షలు చెల్లించారు. మరో జిల్లాలో ఇద్దరు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లకు అసలు, వడ్డీ కలిపి రూ.37 లక్షలను ఒక సిండికేట్ నడిపే వ్యక్తి చెల్లించాడు. ఎసిబి గత డిసెంబర్‌లో కరీంనగర్‌లో జరిపిన దాడి, తర్వాత ఈనెల 25న పలుచోట్ల జరిపిన దాడుల్లో సేకరించిన సమాచారాన్ని మొత్తం క్రోడీకరించుకున్న తర్వాత ఎక్సైజ్ అధికారుల్లో అవినీతి మత్తు ఏస్ధాయికి పెరిగిపోయిందో గుర్తించి చర్యలు చేపట్టింది. దాడుల తరువాత ఎసిబి 750 పేజీల నివేదికను సిద్ధం చేసింది. తాజాగా చేపట్టిన దాడుల్లో దొరికిన లిఖితపూర్వక సాక్ష్యాల ఆధారంగా 8మంది ఎక్సైజ్ అధికారులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించామని ఎసిబి డైరక్టర్ జనరల్ కార్యాలయం తెలిపింది. లంచాలు ఇచ్చినట్టు రికార్డులు నిర్వహించిన నేరంపై 11మంది సిండికేట్ నాయకులపైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్టు ప్రకటించింది. అదేవిధంగా మద్యం సిండికేట్ల లావాదేవీలను నిర్వహిస్తున్న మరో పదిమందిని కూడా అరెస్టు చేశారు. ఇంకా ఎక్సైజ్ అధికారుల లంచాల బాగోతంపై విచారణ కొనసాగుతోందని కూడా ఎసిబి స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Political rowdilu
Mamata banerjee  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles