Space hurricane from the sun sweeping over our planet

Space hurricane from the sun sweeping over our planet,We've been talking a lot about the northern lights lately, but here's a must-see view of the southern lights, as captured

Space hurricane from the sun sweeping over our planet,We've been talking a lot about the northern lights lately, but here's a must-see view of the southern lights, as captured

sun.gif

Posted: 01/25/2012 10:36 AM IST
Space hurricane from the sun sweeping over our planet

Space hurricane from the sun sweeping over our planet  సూర్యుడిపై సంభవించిన సౌరసునామీ.. భూమిని తాకే అవకాశం ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. ఈ సౌర తుఫాన్ వల్ల వెలువడే బలమైన అయస్కాంత తరంగాలు సమాచార వ్యవస్థ, విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సౌర తుఫాన్ ప్రభావం మూడు రకాలుగా, మూడు విభిన్న సమయాల్లో ఉండొచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ మూడింటిలో విద్యుదావేశ కణాలతో కూడిన మహా మేఘం.. భూమి చుట్టూ తిరిగే ఉపక్షిగహాలు, అంతరిక్షంలోని వ్యోమగాములకు తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదం ఉందని, తద్వారా ధృవాలకు సమీపంలో విహరించే విమానాలకు సమాచారం నిలిచిపోయే అవకాశం ఉందని కొలరాడోలోని నేషనల్ ‘ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినివూస్టేషన్స్ (ఎన్‌ఓఏఏ) స్పేస్ వెదర్ ప్రెడిక్షన్ సెంటర్’ ఆందోళన వ్యక్తం చేసింది.
గంటకు 93 మిలియన్ మైళ్ల వేగంతో ప్రోటాన్ల రూపంలో దూసుకొచ్చే ఈ విద్యుదావేశ కణాల మేఘం.. 2005 మే తర్వాత సంభవిస్తున్న అంత్యంత బలమైన వికిరణమని అంతరిక్ష వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త డౌగ్‌బీసెకర్ వెల్లడించారు. వికిరణ మేఘం శక్తి ఎక్కువ కావటం వల్ల దాని ప్రభావం భూమిపై బుధవారమేకాక సుమారు మరో రెండు రోజులు కూడా ఉంటుందని చెప్పారు. సౌర సునామీ ప్రభావం తొలుత విద్యుదయస్కాంత వికిరణ రూపంలో, ఆ తర్వాత ప్రోటాన్ల రూపంలో ఉంటుందని, చివరి రూపం ‘కరోనల్ మాస్ ఎజెక్షన్’(సీఎంఈ) అని మర్యాలాండ్, క్యాథలిక్ యూనివర్సిటీల్లోని ‘నాసా’కు చెందిన గడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అధికారి అల్టిపుల్కినెన్ వివరించారు. సౌర పవనం, జీవవూదవ్యం, అయస్కాంత క్షేత్రాలు విస్ఫోటనం చెంది సూర్యుడి కాంతిమండలంలో మంటలు చెలరేగి అంతరిక్షంలోకి దూసుకురావడాన్నే సీఎంఈ అంటారు.
దీన్నే ‘సోలార్ ఫ్లేర్’గా కూడా వ్యవహరిస్తారు. సీఎంఈ వల్ల ముఖ్యంగా విద్యుత్ సరఫరా చేసే పవర్‌క్షిగిడ్‌లు అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది. అయితే ఈ సీఎంఈ ప్రభావం అంతగా ఉండదని బీసెకర్ చెప్పారు. సీఎంఈతో న్యూఇంగ్లాండ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర మిచిగాన్, మోంటానా, అప్‌స్టేట్ న్యూయార్క్, మోంటానా, వాయవ్య పసిఫిక్‌లో స్వల్పంగానే అంధకారం నెలకొనే అవకాశం ఉందని, భారత్‌కు ఎలాంటి ముప్పూ లేదని భరోసా ఇచ్చారు. కాగా అంతర్జాతీయ అంతరక్ష పరిశోధన కేంద్రంలోని తమ వ్యోమగాములను సౌర తుఫాన్ నుంచి రక్షించేందుకు తాము ఎలాంటి చర్యలూ తీసుకోలేదని నాసా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna will not contest in by elections says babu
Ys jagan emotional speech at guntur odarpu yathra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles