Iraq shrine city to make guinness world record bid

Iraq shrine city to make Guinness World Record bid,Iraq, religion, Shiite, record, offbeat

Iraq shrine city to make Guinness World Record bid

Guinness.gif

Posted: 01/23/2012 04:52 PM IST
Iraq shrine city to make guinness world record bid

Iraq shrine city to make Guinness World Record bid

ముస్లింలలో షియా వర్గం వారికి ఎంతో ముఖ్యమైన పవిత్ర స్థలం కర్బలా నగరానికి గిన్నిస్ బుక్ రికార్డు హోదా సాధించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ సమాచారాన్ని కర్బలా గవర్నర్ అమల్ అల్‌దీన్ అల్ హర్ ఇక్కడ తెలిపారు. ఏటా ఇక్కడ జరిగే అషూరా, అర్బాయీన్ ఆరాధనోత్సవాలకు భారీ సంఖ్యలో షియా యాత్రికులు హాజరవుతారు. ఈ మారు అర్బాయీన్ స్మారకోత్సవాల చివరి రెండు వారాల్లో 1.5 కోట్ల మంది యాత్రికులు కర్బలాను దర్శించుకొన్నారని, వీరిలో 5 లక్షల మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వారని హర్ చెప్పారు.
ప్రభుత్వం ప్రకటించే ఈ లెక్కలను మీడియా, విశ్లేషకులు విశ్వసించడం లేదని, అందుకే గిన్నిస్ నిర్వాహకులకు ఆహ్వానం పంపదలచినట్లు ఆయన చెప్పారు. మహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమామ్ హుసేన్‌ను, ఆయన పరివారాన్ని యాజీద్ ఖలీఫా సైన్యాలు కర్బలా నగరం పరిసరాల్లోనే చుట్టుముట్టి క్రీస్తు శకం 680లో హతమార్చిన రోజైన అషూరా నుంచి 40వ రోజున ఈ అర్బాయీన్ స్మారకోత్సవం ప్రతి ఏటా జరుగుతుంది. ఇరాక్, ఇరాన్, బహ్రెయిన్‌లలో షియాలే అధిక సంఖ్యాకులు. కాగా, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, భారతదేశం, సౌదీ అరేబియాలో కూడా వీరు చెప్పుకోతగ్గ సంఖ్యలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amalapuram mp harshakumar fired on azad
Salman rashdie controversial novel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles