Jaipur literature festival oprah winfrey charms chaotic india

Jaipur Literature Festival Oprah Winfrey charms 'chaotic' India,Women,USA Today,Tom Stoppard,Salman Rushdie,Richard Dawkins,Oprah Winfrey India Visit,Oprah Winfrey,Michael Ondaatje,Jaipur Literature Festival,Come to India Sign,Barack Obama

Jaipur Literature Festival Oprah Winfrey charms 'chaotic' India

Jaipur.gif

Posted: 01/23/2012 03:03 PM IST
Jaipur literature festival oprah winfrey charms chaotic india

Jaipur Literature Festival Oprah Winfrey charms 'chaotic' Indiaభారత్‌లోని కుటుంబ సంస్కృతి తనకు ఎంతగానో నచ్చిందని ప్రపంచ ప్రఖ్యాత టాక్‌షో సెలబ్రిటీ ఓప్రా విన్‌ఫ్రే పేర్కొన్నారు. ఓ టీవీ షో షూటింగ్ కోసం తొలిసారిగా భారత్‌కు వచ్చిన ఆమె.. జైపూర్ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్నారు. భారత కుటుంబ వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. భారత్ అనగానే పేదరికం గుర్తొస్తుందని, కానీ ఎంతో చక్కనైన కుటుంబ సంస్కృతికి పెట్టింది పేరు ఈ దేశమేనని కొనియాడారు.
‘మీరు తల్లిదండ్రులతో పాటు బామ్మ, తాతయ్యల పట్ల బాధ్యతగా ఉంటూ వారిని సంరక్షిస్తారు. నాలుగు తరాల వ్యక్తులు ఒకే కుటుంబంలో కలిసి జీవించడం అద్భుత విషయం. భారత్‌లోని ఈ కుటుంబ సంస్కృతి నాకు చాలా బాగా నచ్చింది. మళ్లీ తప్పకుండా ఇక్కడకు వస్తాను’ అని పేర్కొన్నారు. అయితే ఇక్కడి ట్రాఫిక్ వ్యవస్థపై ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘రెడ్ సిగ్నల్ పడినా జనం ఎవరి దారిన వారు వెళ్లిపోతూనే ఉన్నారు. ఇదేం తీరు’ అని ప్రశ్నించారు.
వితంతువుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని కూడా తప్పుబట్టారు. ఆమె జైపూర్ రావడానికి ముందు ముంబైలోని ఓ వితంతు ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారి దుస్థితిపై ఆవేదన వ్యక్తంచేశారు. ‘మీరు మీ కుటుంబంలోని పెద్దలను ఎంతగానో ప్రేమిస్తారు. అదే సమయంలో భర్తను కోల్పోయిన స్త్రీ బాగోగులు పట్టించుకోకుండా విస్మరిస్తున్నారు. ఈ వైరుధ్యం ఎందుకో నాకు అర్థం కావడంలేదు’ అని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ambedkar statues demolished in amalapuram
Legume vegetables  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles