One day stopped working wikipedia

one day stopped working wikipedia, but one day it stopped working, 24 hours, antivirus, Bills, Websites, america, 3days ,

one day stopped working wikipedia

wikipedia.gif

Posted: 01/18/2012 10:42 AM IST
One day stopped working wikipedia

one day stopped working wikipedia

ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్ వికీపీడియా తన సైట్‌ను 24 గంటల పాటు నిలిపివేయనున్నది. అమెరికన్ పార్లమెంట్ (యూఎస్ కాంగ్రెస్)లో ప్రవేశ పెట్టనున్న యాంటీ పైరసీ బిల్లులకు వ్యతిరేకంగా వెబ్‌సైట్‌ను బ్లాక్‌అవుట్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. బిల్లులు రూపొందిస్తే భావవ్యక్తీకరణకు విధ్యంసకర చట్టంగా మారుతుందని వెబ్‌సైట్లు నిరసనలు తెలుపుతున్నాయి. యాంటీ పైరసీ బిల్లుకు వ్యతిరేకంగా ఇంగ్లీష్ వెర్షన్ సైట్‌ను ఒకరోజు నిలిపివేసేందుకు వికీపీడియా వర్గాలు సిద్ధమయ్యాయని సంస్థకు చెందిన హెడ్ ఆఫ్ కమ్యూనికేషన్ జే వాష్ పేర్కొన్నారు. అమెరికా అంతర్జాతీయ వెబ్‌సైట్లపై ఈ బిల్లు తీవ్ర ప్రభావం చూపుతోందని వాష్ పేర్కొన్నారు. మూడు రోజులపాటు 1800 మంది వికీపీడియా వ్యక్తుల చర్చల అనంతరం ఈ ‘గో డార్క్’ నిర్ణయం తీసుకున్నామని, ప్రతిపాదిత స్టాప్ ఆన్‌లైన్ పైరసీ యాక్ట్ (ఎస్ఓపీఏ), ప్రొటెక్టిప్ బిల్లు (పీఐపీఏ)లను వికీపీడియా వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.  

బిల్లు పాసయితే అంతర్జాతీయ వెబ్‌సైట్లపై సెన్సార్‌షిప్ అమలు చేసే అవకాశం ఉందన్నారు. ఈ అసాధారణ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఉందని ఫౌండర్ జిమ్మీ వేల్స్ పేర్కొన్నారు. అందరూ స్వేచ్చతో కూడుకున్న ఓపెన్ ఇంట్నట్ విధానాన్ని కోరుకుంటున్నారని, పౌరులందరూ నేతలను అభ్యర్థించాలని వికీపీడియా కోరింది. కమ్‌స్కోర్ మీడియా మాట్రిక్స్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఒక నెలలో వికీపీడియా, ఇతర ప్రాజెక్టులు కలిపి 474 మిలియన్ల మంది వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సంస్థ వెబ్‌సైట్‌ను అమెరికా సందర్శకుల కోసం నిలిపివేస్తుందని 24 గంటల పాటు వెబ్‌సైట్ నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఈ రెండు బిల్లులు కాపీరైట్ సమస్యలను అదుపు చేయడానికి ఉద్దేశించినప్పటికీ టెక్నాలజీ పరిక్షిశమ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. అమెరికా పార్లమెంట్ ఈ అసాధారణ నిర్ణయం తీసుకోవడంతో వికీపీడియాతో పాటు ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్లు అయిన రిడిట్, టెక్నాలజీ బ్లాగ్ బోయింగ్ వెబ్‌సైట్లు కూడా తమ సైట్లను నిలిపివేయడానికి సిద్ధమవుతున్నాయి. కాలిఫోర్నియా కేంద్రంగా వికీపీడియాను నెలకొల్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire broke in ghosha mahal police station at hyderabad
16th death anniversary of nt rama rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles