ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నవంబరు 5 న రాష్ట్రంలోని ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలంటూ కేంద్రాన్ని కోరిన రహదారులు 11, మొత్తం 1981 కిలోమీటర్లు. ప్రతిపాదన పంపించారు. కానీ రాష్ట్ర ఎంపీల మధ్యనే సామరస్యం లేక పోవటంతో మా ప్రాంతానికి కావాలి, వాళ్ళ ప్రాంతానికి వద్దు అనే వాదనలతో అసలుకే ముప్పు తెస్తున్నారని ఆరోపణలు వస్తున్నా, అసలు వడ్డించేవారు మనవాళ్ళయితే ఎక్కడ కూర్చున్నా ఒకటే నని, కేంద్రానికి మన రాష్ట్రం మీద సవతితల్లి ప్రేమ మొదటి నుంచీ కనపడుతున్నదే. దానికి కారణం మనవాళ్ళ మెతకదనం, కేంద్రానికి దాసోహమనటమేనని ప్రతిపక్షాలెప్పుడూ ఆరోపిస్తూనేవున్నాయి. ఈ ఆరోపణలో సత్యం లేదనటానికి కూడా లేదు. మన రాష్ట్రానికి కేంద్రలో ప్రాతినిధ్యం వహించే ఎంపీలకేమీ కొదవు లేదు. కానీ ఏ పనులూ ఆ స్థాయిలో కావు. మంత్రిత్వ శాఖలు కానీ గ్రాంట్లు కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో రావు. విపక్షాలు పాలించే రాష్ట్రాలే నయమనిపిస్తాయి.
జాతీయహోదా కోరిన రహదారుల వివరాలు- 1. హైద్రాబాద్- శ్రీశైలం- ఆత్మకూరు- నంద్యాల, 2. సంగారెడ్డి- అకోలా వయా నాందేడు, 3. అనంతపురం- రాయచూర్ వయా ఉరవకొండ, 4. నిర్మల్-ఖానాపూర్-లక్సెట్టిపేట, 5. కాకినాడ- ద్వారపూడి- రాజమండ్రి- కొవ్వూరు- జంగారెడ్డిగూడెం- అశ్వారావుపేట- ఖమ్మం- సూర్యాపేట, 6. హైద్రాబాద్- బీజాపూర్ రోడ్డు- మొయినాబాద్- చేవెళ్ళ- మన్నెగూడ- కొండగల్, 7. రాయచోటి- చిన్న మండెం- గుర్రం కొండ- కురబాలకోట, 8. కృష్ణపట్నం పోర్టు- తల్లపాలెం- 9. నర్సీపట్నం- చింతపల్లి- సీలేరు- డొంకరాయి- మోతుగూడెం- లక్కవరం- చింతూరు, 10. తడ- శ్రీకాళహస్తి- రేణిగుంట, 11. పెనుగొండ- మడకశిర- హిరాయూర్.
దీని వలన రాష్టంలో దేవాలయాలు, ఓడరేవులు, పారిశ్రామకవాడలకు మధ్య రాకపోకలు సౌకర్యవంతంగా అవుతాయన్న దృష్ట్యా ఇది చాలా మంచి ప్రతిపాదనే కానీ, రెండు వేల కిలోమీటర్ల రోడ్డుకి జాతీయా హోదా కల్పించవలసిందిగా కేంద్ర ప్రణాళికా సంఘం ఎప్పుడో సూచించినా దానికింతవరకూ అతీ గతీ లేదు.
దేశ వ్యాప్తంగా 10000 కిలోమీటర్ల రోడ్లను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రణాళిక వేసినా, మన రాష్ట్రం విషయంలో కేంద్ర రవాణా శాఖ నిర్లిప్తత చూపిస్తోంది. ఒకే పార్టీలో కూడా ఉన్న అంతర్యుద్ధాలు సమసిపోయి ముక్తకంఠంతో అడిగితే కానీ రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోదు. అంతేకానీ ముఖ్యమంత్రి పంపించిన ప్రతిపాదనలు ఆయన సొంత వ్యవహారమన్నట్టుగా మంత్రులు, ఎంపీలు ప్రవర్తిస్తే రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, చివరకు చెదలు పడుతుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more