One lakh jobs cm kiran kumar reddy

one lakh jobs cm kiran kumar reddy, Chief Minister Kiran kumar Reddy, Congress Party, Jobs, New Jobs,

one lakh jobs cm kiran kumar reddy

cm kiran.gif

Posted: 01/14/2012 12:32 PM IST
One lakh jobs cm kiran kumar reddy

లక్ష ఉద్యోగాల కల్పన గడువు డిసెంబరుతో ముగిసినా ఈ విషయంలో ఒకడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కు వేసిన చందంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థతి తయారైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్పటి వరకు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ ఉద్యోగాల్లో చేర్చినట్లు చెబుతున్న 75 వేల మందికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయింది. ఈ పరిశీలనలోనే కొంత మంది మధ్యలోనే ఉద్యోగాలు మానేశారని వెల్లడైంది. ఈ విదంగా ఉద్యోగాలు మానేసిన వారందరినీ గుర్తించే పనిలో జిల్లో అధికారులున్నారు. తిరిగి ఉద్యోగాల్లో చేరాలని వారికి మానవి చేయనున్నారు. అయితే, చాలా మంది ఆచూకి దొరకటం లేదు. దీంతో ఆయా అభ్యర్థులను వెతికి పట్టుకొని ఉద్యోగాల్లో చేరెటట్లు చూడాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అంత మంది ఆచూకీని గుర్తించటం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఉద్యోగార్ధులకు వెల్లింగ్ , శానిటర్ , కట్టు , సర్వే ,మేస్త్రీ తదితర పనుల్లో శిక్షణ ఇచ్చిన సంస్థలు తమకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాల్సిందేనని ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నాయి. శిక్షణ ఇచ్చినందుకు ఒక్కో అభ్యర్థి పై సగటున రూ. 7, 500 ప్రభుత్వవం చెల్లించాల్సి ఉంటుందని అంచనా. అభ్యర్థులకు శిక్షణనిచ్చి ఒక ప్రైవేటు సంస్థలో చేర్పించటం శిక్షణ సంస్థల బాధ్యత. అభ్యర్థుల కనీసం మూడు నెలలు ఆ ఉద్యోగంలో ఉండేటట్లు కూడా ఆ సంస్థలు చూడాలి. అధికారులు క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలలో అయిదారు నెలల కిందట కూడా ఉద్యోగం పొందిన వారు కూడా ఉన్నందున .. వారిప్పుడు మానేసినా ఆ బాధ్యత తమది కాదని శిక్షణ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ దెబ్బతో కిరణ్ సర్కార్ కి కొత్త తలనొప్పిగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chaitanyapuri ci praveen reddy arrested
Ten paisa investment is 80 crores profit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles