బెంగళూరులో జరిగిన భగవద్గీత అభ్యస్ కార్యక్రమంలో మాట్లాడుతూ, కర్నాటక ముఖమంత్రి సదానంద గౌడ భగవద్గీతను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలన్న తన అభిమతాన్ని వెలిబుచ్చారు.
సందర్భానుసారంగా ఆ మాటలు మాట్లాడినా, ఇన్నాళ్ళకి ఒక మంచి ప్రతిపాదన తెరమీదికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎక్కడో రష్యాలో ఎవరో మన గ్రంధాన్ని, దాన్ని కూడా ఇస్కాన్ సంస్థాపకుడు స్వామి ప్రభుదేవా రచించిన వ్యాఖ్యలకు రష్యన్ అనువాదరూపాన్ని తిరస్కరించారని వేదన చెందినవారిలో దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నారన్నది పక్కకి పెట్టినా, ఎంతమందికి భగవద్గీతలో కనీస ప్రవేశముంది, ఎంతవరకు అవగాహన చేసుకున్నారన్నది మనందరికీ బాగా తెలుసిన విషయమే. ఈ నేపథ్యంలో పాఠశాల నుంచే భగవద్గీతను పాఠ్యాంశంగా చేస్తే మనమైనా ఆ పవిత్ర గ్రంథానికి గౌరవమిచ్చినవారిమౌతాం. పెద్దలు చెప్పేది వినకుండా, వారిని లెక్కచెయ్యకుండా పెద్దలను గౌరవిస్తాం. మా పెద్దలు మాకు ఆరాధ్యదేవతలు, ఎవరైనా వారిని అగౌరవంగా చూస్తే సహించం అనటం ఎంత అర్థరహితమౌతుందో, అలాగే మనదేశంలోనే భగవద్గీత సారాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా దాన్ని ఇతర దేశస్తులు గౌరవించాలని కోరుకోవటం కూడా అదే కోవకు చెందుతుంది.
అయితే, విక్కమార్కుని సింహాసనానికో ప్రత్యేకతను చెప్తారు. దాని మీద కూర్చున్నంత సేపూ న్యాయబద్ధంగా ప్రవర్తించటం, సత్యమే పలకటం లాంటివి చేస్తారట ఎవరైనా. అలాగే, భగవద్గీతమీద గంభీరోపన్యాసం విన్నప్పుడు, ఆ సభలో ఉపన్యసించమన్నప్పుడు బావోద్వేగం కలిగి ఇలాంటి వాగ్దానాలు చెయ్యటం సహజం. కానీ అంతలో తమాయించుకున్న కర్నాటక ముఖ్యమంత్రి, ఈ నిర్ణయం మీద ఎటువంటి వివాదాలూ తలెత్తకుండా, ఈ విషయంలో అందరి అభిప్రాయాలనూ తీసుకుంటానని ముక్తాయింపు గా అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more