అంత అనుకున్నట్లుగానే జరిగింది. ఇన్ని రోజులు ఎన్నో ఆశలు పెట్టుకున్న లోక్ పాల్ బిల్లుకు పథకం ప్రకారం మంగళం పాడారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు మళ్ళీ బలికావల్సి వచ్చింది. అంతా ఓ పథకం ప్రకారం డ్రామా నడిపించి లోక్ పాల్ బిల్లుకు చిల్లు పొడిచారు. గత చరిత్రే పునరావృతమైంది. నాలుగు దశాబ్దాలుగా ఏం జరుగుతోందో... ఇప్పుడూ అదే జరిగింది. ఎవరి అభ్యంతరాలు వారు వ్యక్తం చేస్తూ... అందరూ కలిసి లోక్‌పాల్‌కు గండి కొట్టారు. గురువారం ఉదయం నుంచి ప్రశాంతంగా, ఆసక్తికరంగా జరిగిన చర్చ... అసలు సమయం వచ్చే సరికి రచ్చగా మారింది. మంగళవారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో గట్టెక్కిన లోక్‌పాల్ బిల్లు గురువారం రాజ్యసభలో 'భయం భయం'గానే అడుగుపెట్టింది. పెద్దల సభలో దీనిని గట్టెక్కించేందుకు యూపీఏకు తగిన బలం లేకపోవడంతో కాంగ్రెస్‌లో హైటెన్షన్ నెలకొంది.
మిత్రపక్షమైన తృణమూల్ కూడా బిల్లును వ్యతిరేకిస్తుండటంతో టెన్షన్ మరింత పెరిగింది. పైగా... వివిధ పక్షాలు ఏకంగా 187 సవరణలు ప్రతిపాదించడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. బయటి నుంచి మద్దతిచ్చే బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీలు సహకరిస్తే మినహా... బిల్లు గట్టెక్కే అవకాశమే లేదు. దీంతో... బల సమీకరణపై కాంగ్రెస్ భారీ కసరత్తు చేసింది. దీనిపై ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీలో సభ్యులు కానప్పటికీ... మంత్రులు కపిల్ సిబల్, పవన్ కుమార్ బన్సల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభలో బిల్లు గట్టెక్కకుంటే... పార్లమెంటు సంయుక్త సమావేశం ఏర్పాటుతో సహా అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది.
కోర్ కమిటీ భేటీ తర్వాత ప్రణబ్, బన్సల్, కపిల్ సిబల్ ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్, బీఎస్పీ నాయకుడు సతీశ్ చంద్ర మిశ్రాలతో సమావేశమయ్యారు. ఈ గందరగోళం నడుమ సభను నడిపించలేమని అసహాయత వ్యక్తం చేశారు. 'రాజ్యసభను ఇలా నడిపేకంటే... అందరం ఇళ్లకు వెళ్లిపోవడమే మంచిది' అని తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు. 'జాతీయ గీతం పాడండి' అంటూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో... అర్ధరాత్రి 12.02 గంటల సమయంలో లోక్‌పాల్‌పై ప్రజల ఆశలు ఆవిరి అయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more