Multivitamin tablets

latest update news world news, india news, ap news, political news, tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

latest update news world news, india news, ap news, political news, tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

multivitamin tablets.gif

Posted: 12/29/2011 10:43 AM IST
Multivitamin tablets

Multi-vitamin-tabletsమీరు రోజూ మల్టీ విటమిన్‌ మాత్రలను తీసుకుంటున్నారా.. అయితే వీటి వల్ల మీ ఆరోగ్యానికి ఒరిగేదేమి లేదని తాజాగా నిర్వహించిన పరిశోధనలో వెల్ల డైంది. ఈ మాత్రలు తీసుకోవటం వల్ల డబ్బు దండగా అని ఫ్రాన్స్‌లోని నాన్సి యూని వర్సిటీ పరిశోధకులు అంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించటానికి 8000 మందిని రెండు సమూహాలుగా విభజించి ఒక సమూహానికి మల్టీవిటమిన్‌ మాత్రలవ్వగా, మరొక సమూహానికి డమ్మీ మాత్రలు ఇచ్చి వారి ఆరోగ్యంలో కలిగే మార్పులను పరి శీలించారు. డమ్మీ మాత్రలు తీసుకునే వారిలో వచ్చే గుండె జబ్బులు, క్యాన్సర్‌ వం టివి మల్టీ విటమిన్‌ మాత్రలు తీసుకున్న వారిలో కూడా రావటాన్ని పరిశోధకులు గుర్తించారు.

వ్యాధుల వచ్చిన వారి శాతం ఇరు సమూహాల్లో 30.5 గా ఉందని వారు తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించి, ఇరు సమూహాల్లోని వ్యక్తులను పరిశోధకులు ప్రశ్నించగా, ఆ రెండు సమూహాలు దాదాపుగా ఒకేవిధంగా స్పందించాయి. విట మిన్‌ మాత్రలపై చేపట్టిన విస్తారమైన అధ్యయనం ఇదని పరిశోధకులు పేర్కొన్నారు. లక్షల మంది ప్రజలు విటమిన్‌ మాత్రలను తీసుకుంటూ తమ డబ్బును వృథా చేసు కుంటున్నారని అని అన్నారు. అనేక మంది విటమిన్‌ మాత్రలు తమను ప్రమాదకర జబ్బులు రాకుండా కాపాడుతాయనే అపోహలో ఉన్నారని లండన్‌లోని సెయింట్‌ జార్జీ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ కాథరిన్‌ కోలిన్‌ అన్నారు. ‘కొంతమంది అల్జీమీర్స్‌, గుండెపోటు రాకుండా తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవటానికి ఈ మాత్ర లను తీసుకుంటున్నారని, ఇది ఫలితంలేని ప్రయత్నాలని’ కాథరిన్‌ అన్నారు. ‘మల్టీ విటమిన్‌ మాత్రలు శరీరానికి తేలికగా పోషకాలు అందిస్తాయనే కారణంతో ప్రజలు వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ విటమిన్‌లతో కలిగే హాని పరిమితంగా ఉన్నప్పటికి చాలా మంది వాటిని అనవస రంగా చాలా తక్కువ పరిమాణంలో తీసుకుంటున్నారని’ పరిశోధకులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anna ends fast due to ill health
Cell phone snatching attracts 7 years imprisonment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles