గోవాని తలదన్నే పర్యాటక స్థలంగా విశాఖ పట్నం రూపుదిద్దుకోనుంది. ఇన్నాళ్ళూ ఎంత సేపూ హైద్రాబాద్ మీదనే దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇక సహజ సౌందర్యాలకు ఆలవాలమైన విశాఖ పట్టణానికి కొత్త అందాలను కట్టబెడుతూ, పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దటానికి నడుం బిగించింది. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక స్థలంగా రూపొందించటానికి ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక విభాగం నిర్మాణరంగంలో శ్రేష్టులైన ఐఎల్ ఎఫ్ ఎస్ లాంటి సంస్థలతో కలిసి 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ప్రైవేటు రంగాల సమిష్టి కార్యంగా విశాఖకు కొత్త రూపాన్నివ్వటానికి ప్రణాళికలు వేస్తున్నారు.
వ్యాపార వేత్తలకూ, శలవుల్లో వచ్చే పర్యాటకులకు, హాయిగా సేదతీర్చుకుని పోదామనుకునే విలాసవంతులకూ కూడా పనికి వచ్చే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖను అలంకరిద్దామనుకునే కార్యక్రమంలో భాగంగా, ఆర్ కే బీచ్ నుంచి భీమ్లీ వరకూ ఉన్న 30 కిలోమీటర్ల రోడ్డుని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దనున్నారని టూరిజమ్ విభాగ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.
సింగాపూర్ ని సింగారించిన హా పార్ కార్పోరేషన్ సాయంతో సముద్రజలాల అడుగున ఉన్న ప్రపంచానికి ప్రతిసృష్టి చేయాలని యోజనలు చేస్తున్నారు. ఇంకా, ఋషికొండ బీచ్ నుంచి అండమాన్ నికోబార్ దీవులకు ఓడలను నడిపటం, అరకు లోయకు ప్రస్తుతమున్న రైల్వే నారో లైన్ స్థానంలో డార్జిలింగ్, ఊటీ లలో చేసినట్టుగా పర్యాటక రైళ్ళను నడుపటం కూడా ప్రణాళికలో ఉన్నాయి.
కొండలు, లోయలు సముద్రం పక్కపక్కనే ఉండి విశాఖకు ముందుగానే ఉన్న సహజ సౌందర్యాన్ని పర్యాటకులకు అనుకూలంగా అదనపు సౌకర్యాలను కలిగించటం వరకే వాళ్ళు చెయ్యవలసింది. దానికోసం విశాఖ ప్రాంతాన్నంతా అభివృద్ధిపరచవలసివుంటుంది. సింహాచలం ఆలయం, అరకు లోయ, రాజమండ్రి నదీ పర్యటనలు కూడా అందులోకి వస్తాయి.
ఇప్పటికే వ్యాపార రంగంలో పుంజుకున్న విశాఖ ప్రాంతం, ఫార్మా సెజ్ ల వలన వ్యాపార రంగంలో మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. పెట్టుబడులతో ముందుకొస్తున్న సంస్థల సౌకర్యార్థం ఇప్పటికే 5 నక్షత్రాల స్థాయి హోటళ్ళు ఐటిసి, వెల్ కం గ్రూప్, ది పార్క్, షెరటాన్, తాజ్ లు కొలువైవున్నాయి. నోవాటెల్ లాంటి విలాసవంతమైన హోటల్ ఈ నెలలోనే వెలిసింది. ఇంకా ఎన్నో సొబగులతో విశాఖ పట్నం రూపరేఖలే మారిపోయి ప్రపంచ పటంలో ప్రముఖంగా చోటు చేసుకోబోతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more