Cm kiran slams the door on mantris

ministers, collectors, Cm kiran kumar reddy, kiran nallari, vatti vasnta kumar, DL Ravindra reddy, Shankar rao, raghu veera reddy.

The shocked ministers trooped out of the hall as the collectors and SPs of their respe-ctive districts looked on.

CM Kiran slams the door on mantris.gif

Posted: 12/16/2011 10:05 AM IST
Cm kiran slams the door on mantris

cm-kiran-kumarహైదరాబాద్ జూబ్లిహాలులో జరుగుతున్న కలెక్టర్ల సమావేశం సాక్షిగా సీఎం కిరణ్ కుమార్ ఏకంగా తన కేబినెట్ లో ఉన్న మంత్రులను అవమానించారు. ఆ సమావేశంలో కూడా కిరణ్ తన ఆధిపత్యాన్ని పదర్శించి మంత్రులను అవమానించడమే కాకుండా, ఆయన అభాసుపాలయ్యారు. కలెక్టర్ల సమావేశంలో మధ్యాహ్న భోజనం తర్వాత శాంతిభద్రతలపై సమీక్ష పెట్టారు.

సమావేశం నిర్వహణలో కీలకపాత్ర పోషించే మంత్రితో పాటు డీఎల్ రవీంద్రారెడ్డి, వట్టి వసంతకుమార్, మరో ఏడుగురు మంత్రులు ఆ సమావేశానికి వెళ్లారు. వెళ్లేముందు.. ఒక మంత్రి అక్కడే ఉన్న అధికారిని వాకబు చేశారు. "మేం ఈ సమావేశానికి వెళ్లవచ్చా? ప్రొటోకాల్ ఇబ్బంది ఉందా?'' అని ఆరాతీశారు. ఎలాంటి ఇబ్బందిలేదని, రాకూడదన్న నిబంధన లేదని, కుర్చీలు కూడా వేశార ని ఆ అధికారి చెప్పారు. కాసేపటికే చేనేత మంత్రి శంకర్‌రావు కూడా ఆ సమావేశంలో వెళ్లి కూర్చున్నారు. సమావేశ ఎజెండాను మంత్రులకు అందించారు.  మంత్రులు వాటిని చదవడం మొదలుపెట్టారు. ఈలోగా సీఎం కిరణ్ సమావేశ మందిరంలోకి వచ్చారు. మంత్రులను చూస్తూ... " అన్నా! శాంతిభద్రతలు నేను హోం మంత్రే కదా సమీక్షించాల్సింది'' అన్నట్లు సమాచారం. దీంతో మంత్రులు ఒక్కరొక్కరుగా లేచి బయటకు వచ్చారు. శంకర్‌రావు మాత్రం అప్పటికీ అలాగే కూర్చున్నారు. ఈ విషయాన్ని గమనించిన సీఎం కార్యాలయ అధికారి బినయ్‌కుమార్ మంత్రి శంకర్‌రావు దగ్గరికి వెళ్లి.. బయటకు వెళ్లాలని విజ్ఞప్తిచేశారు. నేను వెళ్ళను డీజీపీతో మాట్లాడాలని అక్కడే కూర్చున్నారు. చిరవరికి ఆయననుకూడా బయటికి పంపించారు.ఈ పరిణామంపై ఒకరిద్దరు మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఈ పరిణామం ఎటూ వైపుకు దారితీస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A local court issued summons to jeevita
Hazare announces he is ready to dharna at sonias house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles