Running a marathon can damage your heart

marathon, heart, Running, front, segments, runners, chamber, widget, race, Quebec, VO2, fitness, medicine, exercise, Dr. Ori Ben-Yehuda, run

Running a marathon can damage your heart, with more than half of the segments in the heart's main pumping chamber typically functioning a little under par during the race, a new study shows.

Marathon run can damage your heart.GIF

Posted: 12/15/2011 09:42 AM IST
Running a marathon can damage your heart

marathon-runఆరోగ్యం మహాభాగ్యం అంటారు పెద్దలు. రోజు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారంటారు. కానీ అప్పుడప్పుడు నిర్వహించే రన్నింగ్ పోటీలలో పాల్గొంటే మీకు మూడుతుంది అంటున్నారు పరిశోధకులు. మారథాన్ రన్నింగ్ అంటే మీకు ఇష్టమా? అప్పుడప్పుడు మీ ఊర్లో నిర్వహించే 10 కె రన్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారా? అయితే మీరు ఇది చదవండి. ఎందుకంటే మారథాన్ రన్నింగ్‌లో పాల్గొంటే గుండెకు హాని జరిగే అవకాశం ఉందని పరిశోధనల్లో వెల్లడయింది. శరీరం మొత్తానికి గుండె నుంచే రక్తం పంప్ అవుతుందనే విషయం తెలుసుకదా. గుండె నుంచి రక్తనాళాల ద్వారా శరీర భాగాలకు చేరుతూ ఉంటుంది. ఎక్కువ సేపు శ్రమించే వ్యాయామాలు, రన్నింగ్ చేయడం వల్ల గుండెపై ఒత్తిడి పడుతుందని, తద్వారా కుడి రక్తనాళం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మనిషి శరీరం ఎక్కువ సేపు శ్రమించే వ్యాయామాలకు అనువైనది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎక్కువ దూరం పరుగెత్తే ఆటలు రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్‌లాంటి ఆటలను చాలా మంది ఇష్టపడుతుంటారు.

ఫిట్‌నెస్ కోసం వీటిని ఎంచుకుంటుంటారు. అయితే వీటివల్ల శరీరం మొత్తం రక్తం సరఫరా అయ్యేందుకు ఉపయోగపడే గుండె కుడి రక్తనాళం దెబ్బతింటుందని పరిశోధనల్లో తేలింద. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు నలభై మంది అథ్లెట్లపై అధ్యయనం చేశారు. ఇందులో చాలా మంది గుండె రక్తనాళం దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. అందులో ఐదుగురు అథ్లెట్ల గుండెకు శాశ్వత నష్టం జరిగినట్లుగా కనుగొన్నారు. " కొందరు అథ్లెట్లు విపరీతమైన వ్యాయామం చేస్తున్నారు. గంటల తరబడి రన్నింగ్ చేస్తున్నారు. దీనివల్ల వారి గుండె రక్తనాళాలు దెబ్బతింటున్నాయి. వీటికి చికిత్స చేసి పూర్తిగా బాగుచేయడం కూడా కష్టమే'' అని ఈ అధ్యయనంలో పాలుపంచుకొన్న మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయంకు చెందిన పరిశోధకుడు డా. అండ్రె అంటున్నారు. ఈ విషయం తెలిసాక మారథాన్ రన్నర్‌లు ఒకసారి ఆలోచించుకోవడం మంచిదేమో. దానితో మీరు కూడా 5 కె, 10 కె రన్ లలో పాల్గొనే ముందు ఒక్కసారి ఆలోచించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Terrorism effects on nagarjuna sagar dam
Stopping probe on babu not lawful says ys vijaya lawyer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles