రేపు చంద్రగ్రహణం సంభవిస్తున్నందువలన హిందూ మత ఆచారం ప్రకారం అన్ని ఆలయాలనూ ఆ సమయంలోనూ మూసివేసి గ్రహణం విడిచిన తరువాత తిరిగి సంప్రోక్షణ చేసి అప్పుడు సేవలు ప్రారంభించి భక్తులను అనుమతిస్తారు. విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైల మల్లిఖార్జున భ్రమరాంబిక ఆలయాలు, తిరుమల తిరుపతి ఆధ్వర్యంలోని ఆలయాలు ఇంకా ఇతర ప్రసిద్ధికెక్కిన ఆలయాలు అన్నీ ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తాయి. గ్రహణ కాలంలో శబరి మలైలో కూడా అయ్యప్ప స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నామని, ఆ సమయంలో భక్తులు 18 మెట్లను ఎక్కరాదని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.
రేపు జరగబోయే చంద్రగ్రహణం సుదీర్ఘంగా సాయంత్రం 5 గంటలకు పట్టి, రాత్రి 11 గంటలకు విడుస్తుంది. 6.15 నుంచి 9.48 వరకు కంటితో చూడగలిగే ఈ గ్రహణం సంపూర్ణగా రాత్రి 7.36 నుంచి 8.28 వరకు ఉంటుంది. ఈ సంవత్సరంలో ఇదే ఆఖరు గ్రహణం అవటం విశేషం. అంతే కాదు, మళ్ళీ 2018 వరకూ ఇంత కాల పరిమితిలో గ్రహణం సంభవించదని చెప్తున్నారు. అసియా, ఆస్ట్రేలియాల్లో కనిపించే ఈ గ్రహణాన్ని యూరప్ దేశస్తులు చూడలేరు.
పూర్వకాలంలో చాలామంది ఇళ్ళల్లో కూడా గ్రహణ కాలంలోని నియమాలను అనుసరించేవారు. ఆ సమయంలో ఏమీ తినకపోవటమే కాదు, అంతకు ముందు చేసిన వంటకాలు కూడా మిగలిపోకుండా చూసుకునేవారు. కడుపులో కూడా అరగని పదార్థముండగూడదు కనుక గ్రహణం పట్టటానికి చాలా ముందుగానే ఆహారం సేవిస్తారు. నిలవుండే ఆహార పదార్థాలైన పచ్చళ్ళు, మజ్జిగ, త్రాగే నీరు మొదలైనవాటిలో గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణగా దర్భలను వేస్తారు. గర్భిణీ స్త్రీలకు ఇంకా ఆంక్షలుండేవి. వారు చెవి ముక్కు గోక్కోవటం లాంటివేమీ చెయ్యగూడదు. పుట్టే పిల్లలకు తల్లులు గోకిన ప్రదేశంలో లోపాలతో జన్మిస్తారని గాఢంగా నమ్మేవారు.
ఆగమ శాస్త్ర ప్రమాణంలో పూజాదులు కావించే దేవాలయాల్లో గ్రహణ కాలాన్ని అరిష్టంగా భావించి ఆ సమయంలో దీపం కూడా వెలిగించకుండా ఆలయాలను మూసివేస్తే, యోగంలో ధ్యానసాధన చేసేవారు మాత్రం ఆ సమయాన్ని వారికి అనువైన సమయంగా భావిస్తారు. అలాగే మంత్ర శాస్త్రంలో కూడా గ్రహణకాలంలో నదిలో కూర్చుని మంత్రం జపిస్తే అది వారికి సిద్ధిస్తుందని నమ్ముతారు. తంత్రశాస్త్రం, వామాచారాల్లో కూడా గ్రహణానికి ప్రాముఖ్యతనిస్తారు.
క్రమబద్ధంగా సాధారణ క్రమంలో విశ్వంలో జరిగే మార్పులైన రాత్రి పగలు, ఋతువులలో మార్పులు కాకుండా, పౌర్ణమి, అమావాస్యలకు, ఒక్కోసారి ఆ దినాల్లో సంభవించే సూర్య చంద్ర గ్రహణాల సమయంలో విశేషమైన విభిన్నమైన మార్పు సంభవించటం వలన విశ్వంలోని విశ్వశక్తి మానవులకు అందటంలో మార్పు వస్తుందని యోగంలో చెప్తారు. ఆ సమయంలో ఎక్కవు పాళ్ళల్లో శక్తి వస్తుందని కొందరంటే, తక్కువగా ఉంటుందని మరికొందరంటారు. అయితే రెండిటిలో ఏది నిజమైనా ఆ సమయంలో ధ్యానంలో ఉండటం వలన మనిషిలోని శక్తి ఆదా అవుతుంది కాబట్టి వీలయినట్లయితే గ్రహణ కాలంలో ధ్యానం చెయ్యమని అంటారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more