Luca origin for all living creatures

luca origin for all living creatures, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

luca origin for all living creatures, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

luca1.gif

Posted: 11/29/2011 11:03 AM IST
Luca origin for all living creatures

luca-organism     మన పూర్వీకులకు ఆది పురుషుడి పేరు లూకా. సృష్టికి మూలమైన వాడికి పేరేముంటుంది, పేర్లనేవి తరువాత తరువాత మొదలవుతాయి కానీ! అయితే ఈ లూకా అనే పేరు ఇప్పుడు మనం పెట్టుకున్నది. ఇలినోయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన గుస్టావో కేటానో ఎనోల్స్ అనే శాస్త్రఙుడు ''లూకా అని గౌరవంగా పిలిచే ఈ జీవానికి మూలం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సముద్ర గర్భం నుంచి వెలువడింది. భూగోళం మీది అన్ని సముద్ర జలాల్లోనూ నిండిపోయిన ఈ జీవమూలం ఆతర్వాత మూడు గా విడిపోయి మన పూర్వీకులు గా రూపాంతరం చెందింది. ఇప్పుడున్న మానవ రూపాలకే కాదు సమస్త జీవరాశులకూ కారణభూతం ఆ 'లూకా యే. సాగరాలన్నీ జీవాలను తయారుచేసే ఫాక్టరీలుగా తయారయ్యాయి. జీవకణాలన్నీ జీవంతో ఉండటం కోసం పడే యాతనలో ఒకదానితో మరొకటి పోటీలు పడకుండా అన్నీ కలిసి ఒకే ఒక పెద్ద జీవవ్యవస్థగా మారింది. అదే ''లూకా.

     లూకా విడిపోక ముందు ఏం జరిగిందో తెలియదు కానీ, ఆ తర్వాత మాత్రం బాక్టీరియా, అర్కే, యూకార్యోటిస్ అని మూడుగా విడిపోయింది. కేటానో ఎనోల్స్ సిద్ధాంతీకరించినదాని ప్రకారం, జీవ కణాలు అవి జీవంతో ఉండటానికి కావలసిన పోషక పదార్ధాలను ఒకదానికొకటి ఇచ్చి పుచ్చుకునేవి.

     పంజాబీలో ఒక సామెతుంది. ఒక రొట్టె ఉంటే దాన్ని ఇద్దరు పంచుకుని తింటారు కానీ ఒక లక్ష రూపాయలుంటే మాత్రం దానికోసం ఇద్దరూ కొట్టుకుంటారని. అందరూ కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి, అందరూ బతకాల్సిందే అనే భావాలుంటాయి కానీ సంపదలు కూడుతున్నప్పడు మాత్రమే పోటీలుంటాయి. సృష్టి ఆరంభంలో పోటీలు లేవు. జీవించటమనేదే ముఖ్యమప్పుడు. అందువలన జీవకణాలు వాటి ఏకైక లక్ష్మమైన జీవించటం అనే దానికోసం జీవానికి పనికివచ్చే మాలిక్యూల్స్ ని ఒకదానికొకటి అందించుకునేవి. ఈ ప్రక్రియ విశ్వవ్యాప్తంగా జీవ కణాల లక్షణంగా ఉండేది. అందువలన సముద్రమంతా ఒకే కుటుంబ వ్యవస్థగా ఉండేది. వసుధైక కుటుంబం అని అనటమే కాని ఈ కాలంలో చూడటానికి నోచుకోలేదు కదా.

     పోటీ ప్రపంచంలో ఇప్పుడున్న కాలంలో పోటీ పడి సంపాదించుకోవటం, తనకి తనవారికి దాచుకోవటం వరకూ ఉంటే పరవాలేదు. మనవళ్ళ మనవళ్ళు కూడా కూర్చుని తిన్నా తరగనంత ఆస్తిని సంపాదించాలని అధికశాతం మనుషుల భావన! నిజానికి ఒక మనిషికి ఏం కావాలి, ఎంత కావాలి? తన పిల్లలు కూర్చుని తినాలని ఎందుకు కోరుకుంటారు. అంటే తనలాగా తన పిల్లలు సంపాదించే యోగ్యతను కలిగి లేరనా? వాళ్ళే కాదు వాళ్ళ పిల్లలు కూడా చేతగాని దద్దమ్మలనా? అంతేనా, తన పిల్లను పెళ్ళి చేసుకున్నావాడు కూడా చేతగానివాడేననే భావనే కనపడుతోంది. అందుకే అంతలేసి కట్నకానుకలిచ్చి వాళ్లు జీవితాంతం సుఖంగా ఉండాలని కోరుకోవటం!

    ఇందులో మనుషుల తప్పేమీ లేదు. లూకా విడిపోకుండానే ఉండాల్సింది. ముందు మూడుగా విడిపోయిన లూకా మూడు రకాల జీవరాశులను తయారు చేసింది కానీ, ఆ జీవరాశులలో అత్యంత మేధా శక్తిని సొంతం చేసుకున్న మానవులు మానవులుగా బతుకు సాగించకుండా, ఎవరికి వారు విడిపోయారు. అందుకే వచ్చాయి పోటీలు. తనవారు పరాయివారు, తన కులం, వేరే కులం, ఇలా విడిపోతూ వచ్చి చివరకు నేను అనే వ్యక్తిత్వాన్ని ఆపాదించుకోవటం వరకూ వచ్చింది.

     తనకున్న దానికి గర్వం, లేని దానికి చింత, వేరేవారికి ఉంటే ఈర్ష్యాసూయలు, కోపతాపాలు, ఆవేశాలు, నిరాశానిస్పృహలు, ఇవన్నీ వచ్చాయి. దానితో తనకి లేకుండా వేరేవాళ్ళకి ఉండటాన్ని సహించక వారిది పాడుచేసే స్థితికి కూడా వచ్చేస్తున్నారు. ఇలా అవుతుందనుకుంటే లూకా గారు లూకా'' స్థితిలోనే ఉండేవారేమో!

     ఇద్దరు మనుషులు తపస్సు చేస్తున్నారట. దేవుడిని ప్రసన్నం చేసుకుని వరాలు పొందటం వాళ్ళ ధ్యేయం. అయితే మొదటివాడిని అనుసరిస్తున్న రెండవవాడికి తెలిసింది ఒక్కటే, మొదటి వాడికి రెట్టింపు తనకి దక్కాలి అని. ఈ సంగతి తెలుసుకున్న మొదటి వాడు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే నా కన్ను ఒకటి పోవాలి అని కోరుకున్నాడట. అలాగే వాడు ఒంటి కన్నువాడయ్యాడు. వెంటనే రెండవ వాడికి రెండు కళ్ళూ పోయాయి. ఇలాగే ఉంటాయి పోటీలు!

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rs19 lakh reward money to kishan ji informer
Telangana will be a reality soonkcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles