రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు సన్మానం జరిగిన సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబులు ఒకరిని ఒకరు బాగా పొగుడుకున్నారు. చిరంజీవి ముందుగా మాట్లాడుతూ "మోహన్ బాబు, నేను టామ్ అండ్ జెర్రి కారెక్టర్ల వంటివారం. మేమిద్దరం పలకరించుకోమని అనుకుంటారు. మీడియా దృష్టిలో మా మధ్య తగాదా ఉంది. మా మద్య అగ్గిపుల్ల గీయడానికి ప్రయత్నించేవారు ఉన్నారు. దానిని ఎన్ కేష్ చేసుకోవాలని కొందరు చూస్తారు. మేమిద్దరం అలాంటివారికి అవకాశం ఇవ్వరాదు.ఎలాంటి క్రైసిస్ వచ్చినా ముందుగా మేమే రియాక్ట్ అవుతాం.మాది ముప్పై ఏళ్ల అనుబంధం, ఒకరికొకరం పెనవేసుకుని పోయిన జీవితాలు మావి. ఎవరివైపు తప్పు జరిగినా రెండోవారం సర్దుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే దాంపత్య జీవితంలాగానే సాగుతుంది. మోహన్ బాబు మంచి స్నేహితుడు. అలాంటి వ్యక్తి దొరకడం అదృష్టం 'అని అన్నారు. ఆ తర్వాత మోహన్ బాబు సమాధానం ఇస్తూ, ఎవరు అగ్గిపుల్ల గీసినా అది వారికే అంటుకుంటుందని వ్యాఖ్యానించారు.అంతేకాక మోహన్ బాబు కొత్త ఆకాంక్షను వ్యక్తం చేశారు. అదేమిటంటే, చిరంజీవి రాజకీయాలలోకి వెళ్లి ఏదో సాధించాలని అనుకున్నారు. తద్వారా ప్రజాసేవ చేయాలని ఆశిస్తున్నారు. ఆయన ఆకాంక్ష నెరవేరాలని, ఆ సంకల్సం నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటున్నానని, మనసా,వాచా ఈ విషయం చెబుతున్నానని అన్నారు.గతంలో సినీ వజ్రోత్సవాలలో చిరంజీవి, మోహన్ బాబుల మధ్య మాటల వాగ్భాణాలు నడిచిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వీరిద్దరి మద్య సంబందాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే గత కొద్దికాలంగా వీరి మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడుతున్నాయి. ఆ తర్వాత మరో సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ తనకు జరిగిన సన్మానానికి సమాధానంగా మాట్లాడుతూ, నటుడికి మార్కెటింగ్ తెలిసి ఉండాలనే విషయం అర్ధం అయిందని చమత్కరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more