Vijayawada durga temple tenders

Vijayawada Durga Temple Tenders, Irregularities in Vijayawada Durga Temple Tenders, Vijayawada Kanaka Durga

Vijayawada Durga Temple Tenders, Irregularities in Vijayawada Durga Temple Tenders

అమ్మ గుడిలో అవకతవకలు..!

Posted: 11/12/2013 07:38 PM IST
Vijayawada durga temple tenders

క్రిష్ణా జిల్లాలోని దుర్గ గుడిలో వివిధ పనుల సందర్భంగా పిలిచిన టెండర్లలో పలుమార్లు అవకతవకలు జరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో సిబ్బందికి ఆహారపొట్లాలు సరఫరా చేసేందుకు దుర్గ గుడి అధికారులు టెండర్లు పిలిచారు. ముగ్గురికి కాంట్రాక్టులను అప్పగించారు. అధికారులు అనుసరించిన తీరు సరికాదంటూ హైకోర్టు పెట్టిన చీవాట్లతో ఆ పనిని మరొకరికి అప్పగించారు.

 

స్వర్ణశిఖర నిర్మాణంలోనూ ఇదే జరిగింది. కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినా బిల్లులు చెల్లించలేదు. ఆయన కోర్టుకెళ్లడంతో నాలుగేళ్లపాటు పనులు ఆగిపోయాయి. అప్పటి దేవాలయ శాఖ కమిషనర్ సుందరకుమార్ జోక్యం చేసుకుని కాంట్రాక్టర్ ను తొలగించి టిటిడి దేవస్థానం ఆధ్వర్యంలో స్వర్ణ శిఖరం పనులు పూర్తి చేయించారు. ఘాట్ రోడ్డు విస్తరణ పనుల్లో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనే విమర్శలు వచ్చాయి.

 

ఈ పనుల నాణ్యతపై విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. ఇద్దరు అధికారులపై ప్రస్తుతం ఎంక్వయిరీ జరుగుతోందని సమాచారం. ఇక దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న రాజగోపురం, మల్లికార్జున మహామండపం నిర్మాణంలోనూ అవకతవకలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

 

ఇక్కడ పనిచేసి వెళ్లిపోయిన తరువాత కూడా అధికారులను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో దుర్గ గుడి ఈవోలుగా పనిచేసిన చంద్రశేఖర్ ఆజాద్, చంద్రకుమార్‌లపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడమే దీనికి ఉదాహరణ.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more