విశాఖ ఎంపీగా కొనసాగుతున్న దుగ్గుబాటి పురందేశ్వరి రాజకీయ పరిస్థితి మారుతుంది. ఇప్పటికే విశాఖ పై బడా రాజకీయ నేతలు కన్ను వేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానంతో సత్ససంబంధాలు కలిగిన బడా రాజకీయ నాయకులు 2014 ఎన్నికల్లో విశాఖ నుండి పోటీ చేయటానికి రెఢీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో సిటింగ్ ఎంపీగా ఉన్న పురందేశ్వరి పరిస్థితి ఏమిటనేది అర్థం కాకుండా ఉంది. ఢిల్లీ పెద్దలతో పురందేశ్వరి చేసిన ప్రయత్నాలు ఈసారి బెడిసికొట్టే విధంగా ఉండటంతో.. అందుకు ముందు జాగ్రత్తగా పురంధేశ్వరి రూట్ మార్చింది. బెజవాడపై దగ్గుబాటి పురంధేశ్వరి ద్రుష్టి పెట్టింది. ఎంపి పురంధేశ్వరి విజయవాడ నుండి పోటీ చేయడానికి సిద్ధమౌతున్నారా ? రహస్యంగా ఎంపి పురంధేశ్వరి విజయవాడలో పర్యటించి ఒక సామాజికవర్గం కీలకమైన నేతలతో మంతనాలు జరిపారు.
ఈ పర్యటనలో ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. దీనితో కోస్తా ప్రాంతంలో పురంధేశ్వరి పట్టు సాధించడానికే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది తెలుసుకున్న విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. సమావేశాల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. విజయవాడ లేదా రాజమండ్రి నుండి పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీఎం పదవికి పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.
ఏమైన 2014ఎన్నికల్లో మాత్రం దగ్గుబాటి పురంధేశ్వరికి గట్టి రాజకీయ పోటీ ఉంటుందనే విషయం అర్థమవుతుంది. జరగబోయే ఎన్నికల్లో పురందేశ్వరి రాజకీయ జీవితం ఎలా ఉంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more