Congress is always doing injustice to telugu people kodela

Congress is always doing injustice to Telugu People Kodela, Seemandhra Agitations 58, Kodela Siva Prasad, Save Andhra Pradesh

Congress is always doing injustice to Telugu People Kodela

కాంగ్రెస్ ఎప్పుడూ అన్యాయం-విజయవాడలో నిర్ణయం

Posted: 09/26/2013 05:55 PM IST
Congress is always doing injustice to telugu people kodela

తెలుగు వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాద్ అన్నారు. ఆయన ఈరోజు విజయవాడలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ను విడదీయాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు నూకలు చెల్లాయన్నారు. కాంగ్రెస్ లో తెరాస విలీనం అవుతోందని... జగన్ ది మాదీ ఒకటే డీఎన్ ఏ అని దిగ్విజయ్ మాట్లాడారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన పై వైసిపి వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఎప్పటికప్పుడు మాట మార్చే వైసిపి కి విమర్శలు చేసే హక్కు లేదని స్పష్టం చేశారు.

విజయవాడలో నిర్ణయం

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యాంద్రకు మద్దతుగా క్రిష్టా జిల్లా విజయవాడలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2న నిర్వహించే రైతుగర్జనను విజయవంతం చేయాలని రైతుబజారు వర్తకులు, ఎన్జీవోలు ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 72 గంటల దీక్ష చేసిన తెదేపా నేత దేవినేని చందూకు మాజీ మంత్రి కోడెల నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమా పాల్గొన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more