హైదరాబాద్ సిటీలైట్ హోటల్ కుప్పకూలిన ఘటన మరవకముందే విజయవాడలో పురాతన సత్రం కుప్పకూలింది. ఈ సంఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. నగరంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని రాంగోపాల్ సత్రంలోని ఓ విభాగం కుప్పకూలి ఒకరికి గాయాలయ్యాయి. వంద సంవత్సరాలకు పూర్వం సత్రం నిర్మించిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇందులో నివాసం ఉంటున్న ఐదు కుటుంబాల వారు వివిధ పనులపై వెళ్లడంతో ప్రమాదం తప్పింది. గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో ఈ భవనం కూలిపోయే దశకు చేరుకుందని, వెంటనే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. విజయవాడలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలు 300 వరకు ఉన్నాయని, వీటిలో 200 భవనాలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. పాతబస్తీ, సింగినగర్, కృష్ణలంక, సత్యనారాయణపురం, విద్యాధరపురం ప్రాంతాల్లో ఏ సమయంలోనైనా కూలిపోయేలా భవనాలు వున్నాయని సమాచారం. ఇటీవలే వర్షానికి పాతబస్తీలో ప్రాంతంలో ఉన్న ఓ ఇల్లు కూలిపోయింది. సొరంగం ఉన్న ప్రాంతంలో భవనం కూలి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కోమల విలాస్ వద్ద భవంతి కూలిపోయి కాంగ్రెస్ కార్యాలయంపై పడింది. ఇప్పటికైనా పెనుప్రమాదం సంభవించకముందే ప్రభుత్వం, అధికారులు మేల్కొని చర్యలు తీసుకోవాలని విజయవాడ వాసులు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more