కేంద్ర మంత్రి కావూరి స్వాగత ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. బాణసంచా పేలి మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నాడు విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో చోటుచేసుకోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..కేంద్ర మంత్రి పదవి దక్కిన తర్వాత మొదటి సారి జిల్లాకు వస్తున్న కావూరికి స్వాగతం పలికేందుకు భారీగా కార్యకర్తలు, నేతలు గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చారు. అయితే, ఇటీవల తెలంగాణ అంశంపై కావూరి వ్యాఖ్యలకు నిరసనగా సమైక్యవాదులు ఆయనను అడ్డుకుంటారనే అనుమానంతో పోలీసులూ భారీగా మోహరించారు. నేతలు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి కావూరికి స్వాగత ర్యాలీ ఏర్పాటు చేశారు. ర్యాలీలో భాగంగా బాణసంచాలు కాల్చారు. ఈ క్రమంలో బాణసంచాలు ఉన్న వాహనంలోఅకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కేంద్రమంత్రిగా దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. కేంద్ర మంత్రిగా తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ.. తనకు పదవి కాంక్ష లేదని, పదవి కోసం ఎవరి కాళ్లు పట్టుకోలేదని తెలిపారు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరానని చెప్పారు. నేతన్నలకు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటుకు ప్రయత్నిస్తానని కావూరి హామీయిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more