విజయవాడలో సిరీస్ కంపెనీ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు గోకరాజు సుబ్బరాజు (94) సోమవారం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు నల్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య 2009లో పరమపదించారు. కొన్ని నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఆయన దగ్గరి బంధువు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో సిరిస్ ఫార్మాసూటికల్ కంపెనీని తీర్చిదిద్దారు. విజయవాడలో ప్రారంభించిన సీరిస్ కంపెనీ హైదరాబాదు లో కూడా విస్తరించారు. 1958లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తొలి శాసన మండలి వైస్ చైర్మన్‌గా పనిచేశారు. రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిలో గుర్తింపు పొందారు.
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన ఆయన గాంధేయవాదిగా పేరు సంపాదించారు. విజయవాడ ఉడా తొలి చైర్మన్‌గా, కార్పొరేటర్‌గా, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. సీరీస్ రాజు జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ నేతల అడుగుజాడల్లో నడుస్తూ మంచి పేరు సంపాదించారు. ఆవిధంగా జాతీయ కాంగ్రెస్ నాయకుల్లో ఆయనకు సుస్థిరమైన స్థానం ఉంది. బెనారస్ హిందు యూనివర్శీటీ, కాలిఫోర్నియా యూనివర్శీటీలో ఎంఎస్ విద్య నభ్యసించిన రాజు విజయవాడ సమీపంలోని కానూరు గ్రామంలో తొలిసారిగా 50దశకంలో సీరీస్ కంపెనీ పెట్టారు. కేవలం పారిశ్రామిక వేత్తగానే కాకుండా తన కుటుంబ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాజు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చారు. విజయవాడలోని ఆయన స్వగృహం బృందావనం కాలనీ నుంచి మంగళవారం అంతిమ యాత్ర ప్రారంభమౌతుందని కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ వర్గీయులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more