సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంపురం ప్రాంతంలో ఎలకచర్ల శాంతకుమార్(22) హత్యకు గురయ్యాడు. సీతారాంపురం రైవస్ కాల్వగట్టుపై అతను తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. అవివాహితుడైన కుమార్ వాంబే కాలనీలో ఉడ్ పాలిషింగ్ పని చేసేవాడు. ఆదివారం కావడంతో పనికి పోలేదు. సరదాగా బయటకు వెళ్ళి రాత్రి ఏడు గంటల ప్రాంతానికి ఇంటికి చేరాడు. ఆ సమయంలో కుమార్ సెల్‌ఫోన్‌కు ఓ ఫోన్ వచ్చింది. ఫోన్లో అవతలి వ్యక్తితో మాట్లాడిన కుమార్ వెంటనే బయటకు వెళ్ళాడు. అతను బయటకు వెళ్ళిన వెంటనే తండ్రి దుర్గారావు దగ్గర్లోనే ఉన్న తన భార్య నిర్వహించే దుకాణానికి వెళ్ళాడు. కొద్ది నిమిషాలు గడిచాయి. అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ దుకాణం వద్దకు వచ్చి అక్కడే ఉన్న కుమార్ తల్లిదండ్రులతో 'మీ అబ్బాయి ఈ పక్కనే రక్తపు మడుగులో పడి ఉన్నాడు' అని చెప్పింది. వెంటనే వారిద్దరూ అటువైపు పరుగెత్తారు.
సీతారామపురం ఆంధ్రాబ్యాంకు పక్క రోడ్డులో చెత్త డంపర్ బిన్ల పక్కనే చీకటిలో అప్పటికే కుమార్‌పై కొంత మంది కత్తులతో దాడి చేశారు. ఒంటిపై సుమారు ఐదు చోట్ల బలంగా నరికారు. ఈ దృశ్యం చూసి కుమార్ తల్లిదండ్రులు పెద్దగా కేకలు వేసే సరికి జనం పోగయ్యారు. వెంటనే 108కు సమాచారం అందించారు.గాయాలతో ఉన్న కుమార్‌ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. కుమార్ ఇంటికి, అతని తల్లిదండ్రులు నిర్వహించే బడ్డీ కొట్టుకు హత్య జరిగిన స్థలానికి కేవలం 30 గజాల దూరం మాత్రమే ఉండడం గమనించదగ్గ విషయం. విషయం తెలుసుకున్న సూర్యారావుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరిపిన సోదాల్లో వారికి హత్యకు వినియోగించిన రెండు కత్తులు కనిపించాయి. వీటిలో ఓ కత్తి హత్య జరిగిన ప్రదేశం పక్కనే ఉన్న చెత్త డంపింగ్ బిన్లో దొరికింది. మరొకటి రోడ్డుపైనే పోలీసులకు దొరికింది. ఏసీపీ హరికృష్ణ సంఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. క్లూస్ టీం ఆ ప్రాంతానికి వచ్చి ఆధారాలు సేకరించింది. ఇన్స్పెక్టర్ జయరాజు నేతృత్వంలో కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనలో కుమార్‌పై దాడి చేసిన వారి వివరాలు, అందుకు గల కారణాలు తమ విచారణలో తెలియవలసి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more