Today chandrababu visit to kuppam

Today Chandrababu Visit to Kuppam, Today Chandrababu Visit to Kuppam, Chandrababu on visit to Chittoor, TTD,

Today Chandrababu Visit to Kuppam, Chandrababu on visit to Chittoor

చిత్తూరులో బాబు పర్యటన-టిటిడి అక్రమ లీలలు..

Posted: 11/18/2013 09:26 PM IST
Today chandrababu visit to kuppam

టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, సమావేశాలలో బాబు పాల్గొననున్నారు. చాలాకాలం తరువాత వస్తున్న బాబుకు ఘనంగా స్వాగతం పలికేందుకు టిడిపి శ్రేణులు ఏర్పాట్లు చేశారు. పార్టీ జిల్లా నాయకులు, ముఖ్య నాయకులతో బాబు సమావేశమవుతారు. సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లా పార్టీ, నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యచరణ చేపట్టాలనే విషయంపై ఆయన జిల్లా నేతలతో చర్చించే అవకాశం ఉంది.

 

బాబు నేడు పర్యటన వివరాలు..

మంగళవారం :- ఉదయం 9.00 గంటలకు కుప్పంలో సమన్వయ కమిటీ సమావేశం. 10.00 ప్రజల నుండి వినతులు స్వీకరణ. 11.00 సర్పంచ్ లు, వార్డు సభ్యులతో సమావేశం. 2.00 గంటలకు కుప్పంలోని వంద పడకల ఆసుపత్రిలో మహిళా సదస్సు. 4.00 నుండి 6.00 గంటల వరకు టిడిపి కార్యకర్తల సమావేశం. సాయంత్రం 6.45 నిడుమూరులో ఆదర్శ పాఠశాల ప్రారంభం. 7.30 కృష్ణగిరి దేవరాజ్ మహల్ కళ్యాణ్ మంటపం ప్రారంభం. రాత్రి 10.00 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుండి హైదరాబాద్ కు తిరుగు పయనం..

 

 

టిటిడి అక్రమ లీలలు..

టిటిడి అవినీతిమయం అయింది. శ్రీవారి పేరున వస్తున్న ఆదాయాన్ని కొంతమంది టిటిడి అధికారులు కాజేస్తున్నారు. స్వామివారి కళ్యాణోత్సవాల పేరిట కోట్ల రూపాయలను దండుకుంటూ స్వామివారిని నిలువుదోపిడి చేస్తున్నారు. టిటిడి ఆద్వర్యంలో దేశ, విదేశాల్లో నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణోత్సవాల్లో వెలుగుచూస్తున్న అవినీతి, అక్రమాలు టిటిడి పరువును దిగజార్చే విధంగా ఉన్నాయి.

 

శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామికి తిరుమల శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో నిత్యం కళ్యాణోత్సవం జరుగుతుంది. శ్రీవారి ఆలయంలో జరిగే కళ్యాణానికి స్థలాబావం తీవ్రంగా ఉండడంతో భక్తులందరికీ శ్రీవారి కల్యాణోత్సవం టిక్కెట్లను టిటిడి ఇవ్వలేక పోతోంది. దీంతో భక్తుల కోరిక మేరకు వారి వారి ప్రాంతాలలోనే కళ్యాణోత్సవాలు నిర్వహించి, స్వామివారిని భక్తులకు మరింత దగ్గరకు చేర్చాలని టిటిడి నిర్ణయించింది. టిటిడి ఈవోగా కృష్ణారావు ఉన్న రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణోత్సవాలను నిర్వహించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles