Congress party vs ysrcp in rachabanda

congress party vs ysrcp in rachabanda, congress party leaders, ysr congress party,

congress party vs ysrcp in rachabanda

తిరుపతి రచ్చబండలో వైసీపీ రచ్చ

Posted: 11/16/2013 08:37 PM IST
Congress party vs ysrcp in rachabanda

రచ్చబండ గ్రామసభల్లో సమైక్యవాదుల ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. ఈరోజు వెదురుకుప్పంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం వైసీపీ శ్రేణుల ఆగ్రహంతో రచ్చరచ్చగా మారింది. సమైక్యాంధ్ర ఉద్యమం తగ్గిందని వేదికపై నుంచి కాంగ్రెస్ నాయకుడొకరు చేసిన ప్రసంగాన్ని సాకుగా తీసుకొని వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. సభా వేదిక కోసం ఏర్పాటు చేసిన షామియానాను పీకి పడేశారు. వేదికపైకి కుర్చీలు విసిరి కొట్టారు. అడ్డు వచ్చిన పోలీసులను నెట్టిపడేశారు.

 

వైసీపీ శ్రేణుల ఆగ్రహానికి హడలిపోయిన మహిళలు భయంతో పరుగులు తీశారు. రచ్చబండ కార్యక్రమంలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా సీఎం సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి తెలివిగా వ్యవహరించారు. పీలేరు నియోజకవర్గ పరిధిలోని వాల్మీకిపురం,గుర్రంకొండ రచ్చబండ వేదికలపై నుంచి ఆయన సమైక్యాంధ్ర నినాదాలు చేసి ప్రజలను శాంతింపజేసి సభలను మొదలు పెట్టారు. రొంపిచర్ల రచ్చబండ కార్యక్రమాన్ని ఆ మండలానికి చెందిన వైసీపీ సర్పంచులు బహిష్కరించడంతో ఇద్దరు తెలుగుదేశం సర్పంచ్‌లతో మొక్కుబడిగా సభను ముగించారు.

 

గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కుతూహలమ్మ అధ్యక్షతన వెదురుకుప్పంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన రచ్చబండ కార్యక్రమం పథకం ప్రకారం రణరంగంగా మారింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ధ్యేయంతో వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకోగా గమనించిన పోలీసులు వారిని వేదికకు దూరంగా నిలువరించారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని వారిని సభ వద్దకు అనుమతించండని పోలీసులకు సూచించడంతో వైసీపీ శ్రేణులు వేదిక వద్దకు చేరుకున్నాయి. సభనుద్దేశించి పీఏసీఎస్ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు భీమ శంకర్‌రెడ్డి మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.సమైక్య ఉద్యమ తీవ్రత చల్లబడింది అనడంతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. సమైక్య నినాదాలు చేస్తూ వేదికపైకి దూసుకొచ్చిన కార్యకర్తలు షామియానాను పీకేశారు. వేదికపైకి కుర్చీలు విసిరారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులతో తోపులాటకు దిగారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles