Mp chinta mohan house hit by power cut devotees facing problems

MP Chinta Mohan House Hit by Power Cut, Devotees Facing Problems, Samaikyandhra Supporters Blocked Roads at Chittoor, Samaikyandhra Movement, Roads to Tirupati blocked, United AP activists block roads in Seema

MP Chinta Mohan House Hit by Power Cut, Devotees Facing Problems

ఎంపీ ఇంటికి కరెంటు కట్- ఇబ్బందుల్లో భక్తులు

Posted: 10/04/2013 08:56 PM IST
Mp chinta mohan house hit by power cut devotees facing problems

తెలంగాణ నోట్ వ్యతిరేకంగా.. సీమాంద్రలో..ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడింది. సీమాంద్ర బంద్ దెబ్బ తిరుపతి పై బాగా చూపించింది. తిరుపతి ఎంపీ చింతామోహన్ ఇంటికి కరెంట్ కట్ చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా చింతామోహన్ రాజీనామా చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆయన నివాసానికి విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత సరఫరాను నిలిపివేశారు. రూ. 3.50 లక్షల రూపాయలు బకాయిలు పడ్డారని అందుకే కరెంటు కట్ చేశామని విద్యుత్ సిబ్బంది పేర్కొంటున్నారు.

 

ఇబ్బందుల్లో భక్తులు..

శ్రీవారికి సమైక్య సెగ తాకింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ బంద్ పాటిస్తున్నారు. దీనితో తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. తిరుగుతున్న పలు బస్సులను సమైక్యవాదులు అడ్డుకుని టైర్లలో నుండి గాలిని తీసేశారు. దీనివల్ల కొండపైనే సుమారు 40వేల మంది భక్తులు పడిగాపులు పడుతున్నారు. గమ్యస్థానాలకు ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేక టిటిడి చేతులేత్తిసింది. తిరుపతిలోని పలు కూడళ్లలో ఉన్న నేతల ఫ్లెక్సీలను సమైక్యవాదులు చించేశారు.

 

తిరుపతి అలిపిరి వద్ద భారీగా సమైక్యవాదులు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. రెవెన్యూ శాఖకు చెందిన ఉద్యోగులు, ఎపిఎన్జిఓలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు అలిపిరి వద్ద బైఠాయించారు. దీనితో వాహనాలు ఎక్కడికక్కడనే నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ డిమాండ్ చేశారు. మొత్తం 48గంటల పాటు బంద్ పాటిస్తున్నట్లు సమైక్యవాదులు పేర్కొన్నారు. వాహనాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచే వరకు తాము పోరాడుతామని సమైక్యవాదులు స్పష్టం చేస్తున్నారు. మంత్రలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

 

దిగ్భందం

జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులను సమైక్యవాదులు దిగ్భందించారు. తిరుపతిలో శంకరంబాడి కూడలి వద్ద రహదారిని దిగ్భందించి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా నిలిచిపోయాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles