Heavy flow of devotees at tirumala

Heavy flow of devotees at Tirumala, Tirumala sees heavy pilgrim rush, devotees at Tirumala

Heavy flow of devotees at Tirumala, Tirumala sees heavy pilgrim rush

ఊపందుకున్న భక్తుల రద్దీ

Posted: 09/20/2013 08:43 PM IST
Heavy flow of devotees at tirumala

తిరుమలలో ఈరోజు భక్తుల సంఖ్య ఊపందుకుంది. తమిళులకు అతి ముఖ్యమైన పెరటాసి మాసంలోని మొదటి శనివారం శ్రీవారిని దర్శించుకోవాలన్న ఉద్దేశ్యంతో అక్కడి భక్తులు తండోపతండాలుగా తిరుమలకు వస్తున్నారు. రెండు కాలిబాటల నుంచి వచ్చేవారే అధికంగా ఉంటున్నారు. రద్దీ పెరగడంతో గదుల కోసం వివిధ కౌంటర్ల వద్ద భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి సంబంధించి రెండో వైకుంఠం క్యూకాంప్లెక్సులోని 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 22 గంటలు, దివ్యదర్శనానికి 8 గంటల సమయం కేటాయించారు. రద్దీ పెరుగుతుండటంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల జారీని సాయంత్రం 6 గంటలకే ఆపేశారు. ఇక మహాలఘులో సుమారు 55 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. పెరటాసినెల మొదటి శనివారం, ఆదివారం సెలవుదినం కావడంతో రెండు రోజుల పాటు రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles