సీమాంధ్రలోని ఆరుకోట్ల మంది ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రలోని చేతి వృత్తుల వారు సైతం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని తుడా సర్కిల్ లో క్రిస్టియన్ మైనార్టీల దీక్షలో భూమన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన నడిరోడ్డుపై బుట్టలు అల్లుతూ నిరసన తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటానికే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబునాయుడు... సోనియాగాంధీకి సహకరించారని కరుణాకర్ రెడ్డి అన్నారు.
పాండిచ్చేరి మంత్రికి సమైక్య సెగ
రామచంద్రాపురం మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు నిర్వహిస్తున్న సమైక్యాంద్ర ఆందోళనలో రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పాండిచ్చేరి విద్యుత్తుశాఖ మంత్రి త్యాగరాజన్ తిరుపతికి వెళ్తుండగా ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. దీంతో ఉద్యమ నాయకులు విద్యుత్తు శాఖ మంత్రి వాహనాన్ని అడ్డుకుని ఆయన చేత సమైక్యాంద్ర నినాదాలు పలికించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు వేణుగోపాల్ నాయుడు, హరిప్రసాద్ నాయుడు, నరసింహారెడ్డి , బాబు నాయుడు , తదితరులు ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more