Samaikyandhra sega 48 hours bandh in tirupati

samaikyandhra sega 48 hours bandh in tirupati, 48 hours total bandh at Tirupati, JAC Calls 48 Hours bandh in Tirumala Hills

samaikyandhra sega 48 hours bandh in tirupati, JAC Calls 48 Hours bandh in Tirumala Hills

శ్రీవారికి తాకిన సమైక్య సెగ- భక్తులు కష్టాలు

Posted: 08/28/2013 02:52 PM IST
Samaikyandhra sega 48 hours bandh in tirupati

సమైక్య సెగ తిరుమలేశుడిని తాకింది. దాంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సమైక్యాంధ్ర సాధనలో భాగంగా తిరుమతిలో అష్ట దిగ్బంధం కొనసాగుతోంది. తిరుపతి బంద్‌కు స్వచ్ఛంద, ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నేడు, రేపు ...రెండురోజుల పాటు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో తిరుపతిలో జన జీవనం పూర్తిగా స్తంభించింది. విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. బంద్ నేపథ్యంలో నగరంలో ద్విచక్ర వాహనాలు మినహా ఆటో, రిక్షా, జీపు, ట్యాక్సీలు, లారీలు రోడ్డెక్కలేదు. అలాగే అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులకు మినహాయింపు ఇచ్చినా ఫలితం కనపడలేదు. బెంగళూరు మార్గం నుంచి తిరుమలకు వచ్చే వాహనాలను బైపాస్ మీదుగా చెర్లోపల్లె, జూపార్కు మీదుగా అలిపిరికి, ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే వారు కరకంబాడి మీదుగా లీలామహల్, కపిలతీర్థం అలిపిరి వరకు చేరుకుంటున్నారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ 12 బస్సులను మాత్రమే ఏర్పాటు చేయటంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీటీడీ 10 ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. బంద్ నేపధ్యంలో నగరంలో టీటీడీ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు ఆహార పొట్లాలు ఉచితంగా సరఫరా చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles