Managudi program in tirupati

managudi program in Tirupati, cleansing of temples managudi program, Managudi in Tirupati, Padmavathi womens college tirupati

managudi program in Tirupati

మొక్కుబడైన మనగుడి

Posted: 08/21/2013 09:02 PM IST
Managudi program in tirupati

తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్రదేవాదాయశాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమం మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ తిరమలలో ప్రారంభించారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలు పెంచడానికి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఇప్పటికి రెండు విడతలుగా విజయవంతంగా నిర్వహించారు. గత ఏడాది ఆగస్టు 213,342 ఆలయాల్లో జరగ్గా, రెండో విడత నవంబరు 28న కార్తీకపౌర్ణమిన 17,536 ఆలయాల్లో నిర్వహించారు. మూడో విడతగా  21,142 దేవాలయాల్లో నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి తిరుమల నుంచి ఇటీవల టీటీడీ వస్త్రాలు, సారె, కంకణాలు అన్ని దేవాలయాలకు పంపారు. దాదాపు 2 కోట్ల కంకణాలు భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలోని 4,854 దేవాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు

ఈ రోజు తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధిలో జరిగే మనగుడి కార్యక్రమానికి భక్తులు తండోపతండాలుగా వస్తారని ఆశించారు.  కానీ సమైక్యాంధ్ర ఉద్యమం దానికి తూట్లు పొడిచింది, ఆలయ ఆదాయానికీ గండిపడింది.  ముందుగా అనుకున్నారు కనుక కార్యక్రమాన్నైతే ప్రారంభించారు కానీ అది గుడిలో కాక బడిలో జరిగింది. 

ఒడి, బడి, గుడి- అన్నిట్లోనూ మనిషి తన జీవితంలో అవసరమైనవి పొందుతాడు.  వీటిలో గుడి మొక్కుబడి అయింది.

తల్లి ఒడిలోకి వచ్చిన మనిషి మమకారం, ప్రేమ, ముద్దు ముద్దు మాటలు నేర్చుకుని, లేచి నిలబడటం జరుగుతుంది.  బడిలో ఓనమాలతో మొదలై బ్రతుకుతెరువుకు కావలసిన విద్యను అభ్యసించటం జరుగుతుంది.  ఇక గుడిలో ఆధ్యాత్మిక ఎత్తులను అధిరోహించటం జరిగి బ్రతుకు తెరువు కాదు, అసలు బ్రతుకంటే ఏమిటో తెలుసుకోవటం జరుగుతుంది. 

కానీ గుడికి మనం ఇచ్చేది చిట్టచివరి ప్రాధాన్యత.  చెయ్యవలసిన పనులు ఎక్కువైపోయి సమయం వాటన్నిటికీ సరిపోనప్పుడే కొన్ని పనులు ప్రాధాన్యతలను సంతరించుకుంటాయి, కొన్ని చేసుకోవు.  అలా ప్రాధాన్యతలలో చివర్లో నిలబడేది గుడి.  జీవితంలో ఏదైనా కోరుకోవటానికి, లేదా ఆటవిడుపు కోసం గుడులకు వెళ్ళేవారే ఎక్కువమందైపోయారు.  అందుకే గుడికి పోవటం మొక్కుబడి అయింది.  మొక్కుబడి అన్నది నిజానికి మనం దేవుడికి ఇది చేస్తాను అని మొక్కుకుని చేసే పని.  కానీ కాలక్రమంలో మొక్కుబడి అంటే యాంత్రికంగా చెయ్యటం అనే అర్థం వచ్చింది ఎందుకంటే మనలో చాలా మంది గుడిలో కానీ ఇంట్లో కానీ పూజ చేసేది యాంత్రికంగానే కనుక.  అందుకే యాంత్రికంగా, అనాలోచితంగా, శ్రద్ధ చూపకుండా, చెయ్యాలి కాబట్టి చేసాం, అని చేసే పనికి మొక్కుబడిగా చెయ్యటం అనే అర్థం వచ్చింది.

తిరుమల తిరుపతి దేవస్థానముల చేత ఏర్పాటు చెయ్యబడ్డ ధర్మ ప్రచార పరిషత్, ధర్మాదాయ దేవాదాయ శాఖ వారితో కలిసి రచించిన మనగుడికి నుడికారం జరిగింది ఆగస్ట్ 11 న  అది ఈ రోజు శ్రావణ పౌర్ణమితో అంతమవుతోంది. 

భక్తుల సమక్షంలో ఘనంగా జరగవలసిన గుడిలోని పారిశుద్ధ్య కార్యక్రమం జరగలేదు కాబట్టి ఈ రోజు తిరుపతిలో జరిగిన మనగుడి కార్యక్రమం కూడా మొక్కుబడిగా జరిగిందని చెప్పుకోవచ్చు.  అయితే ఈ మధ్యలో రాష్ట్రంలో అనేక ఆలయాల్లో జరిగిన మనగుడి కార్యక్రమం మాత్రం విజయవంతమయ్యాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles