Ttd to implement dress code in vip break darshan

tirumala tirupati devasthanams, dress code in vip break darshan, dress code, vip devotees, dress code for devotees in tirumala tirupati

TTD to implement dress code in VIP break darshan

విఐపి భక్తులకు డ్రెస్ కోడ్ ?

Posted: 05/10/2013 11:23 AM IST
Ttd to implement dress code in vip break darshan

శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి తిరుమలకు విచ్చేసే భక్తులు స్వామివారి నైవేద్య విరామ దర్శన సమయంలో తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులను ధరించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ఈనెల 15 వ తేది నుంచి అమలు చేయనున్నారు. ప్రపంచంలో ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన టిటిడి హైందవ సనాతన ధర్మ విలువలను కాపాడడమే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా శ్రీవారి దర్శనానికి నిత్యం విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సంప్ర దాయ దుస్తుల డ్రస్‌కోడ్‌ అమలు చేయాలని అనేక మంది భక్తులు టిటిడికి వివిధ సందర్భాలలో సూచిస్తున్నారు.

ఈ మేరకు ఇప్పటికే ఆర్జిత సేవలలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులను ధరించి పాల్గొనాలనే నిబందనను అమలు చేసింది. అయితే దశలవారిగా తిరుమలకు విచ్చేసే భక్తులందరికి సాంప్రదాయ దుస్తుల పద్దతిని అమలు చేయాలని టిటిడి నిర్ణయించింది. అందులో భాగంగా ఈనెల 15 వ తేది నుంచి ప్రముఖుల విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా భారతీయ సంప్రదాయ దుస్తులలోనే శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. పురుష భక్తులు పంచ - ధోవతి లేదా కుర్తా - పైజామా మహిళలు చీర - రవిక, లంగా - ఓణి, పైన చున్నీతో పంజాబి డ్రస్‌ లేదా చుడీదార్‌ ధరించ వలసి ఉంటుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles