Telugu desam chandra babu naidu and family visit tirupati

chandra babu family visit tirupati, Chandrababu family visit Tirumala, tdp chief chandrababu naidu, gali muddu krishnam naidu, tdp leaders, ttd officers,

chandra babu naidu and family visit tirupati

చంద్రబాబుకు స్వాగతం

Posted: 05/11/2013 10:31 AM IST
Telugu desam chandra babu naidu and family visit tirupati

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్, కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది. శంకరంబాడి సుందరాచారి విగ్రహం వద్ద, తిరుపతి లీలామహల్ వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడినప్పటికీ దైవదర్శనం తరువాతే మాట్లాడతానంటూ ప్రజలకు అభివాదం చేస్తూ బాబు వెళ్లిపోయారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం వద్ద నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు, తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలో నాయకులు స్వాగతం పలికి తండ్రీ కొడుకులను గజమాలతో సత్కరించారు.

రాత్రి 7.00గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న బాబుకు స్వాగతం పలికిన కార్యకర్తలు, నాయకులు అక్కడ నుండి టి ఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సుమారు 500 మోటార్‌సైకిళ్లతో ర్యాలీగా బాబు వాహనానికి ముందు కదిలారు. శంకరం బాడి సుందరాచారి విగ్రహం ముందు మహిళలు మంగళహారతులు పట్టారు. గుమ్మడి కాయలతో దిష్టితీశా రు. అక్కడినుంచి బయలుదేరిన మోటార్‌సైకిల్ ర్యాలీ రామానుజం సర్కిల్ మీదుగా పూర్ణకుంభం, శ్రీనివాసం, లీలామహల్ సర్కిళ్ల మీదుగా సాగింది. లీలామహల్ వద్ద పెద్ద ఎత్తున గుమిగూడిన ప్రజలకు ఆయన కారులోనుంచే అభివాదం చేశారు. అక్కడ నుండి సుమారు 8.40గంటలకు ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకున్నారు. తిరుమలలో టిటిడి అధికారులు ఆయనకు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. శనివారం తెల్లవారుజామున స్వామివారి సు ప్రభాత సేవలో బాబు కుటుంబంతో కలసి పాల్గొంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles