Political cm kiran amma hastam in chittoor

cm kiran amma hastam in chittoor, cm kiran to launch amma hastam, congress party, amma hastam, district chittoor, elephants attack on chittoor villages,

cm kiran amma hastam in chittoor

చిత్తురు జిల్లాకు కురిపించిన సీఎం వర్షం?

Posted: 04/24/2013 05:34 PM IST
Political cm kiran amma hastam in chittoor

తక్కువ ధరకే పేదలకు నిత్యావసర సరుకులు అందించే 'అమ్మహస్తం' పథకాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా బి. కొత్తపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 'అమ్మహస్తం' పథకం వల్ల చాలా మంది పేదవారికి లబ్ధి కలుగుతుందని ఆయన అన్నారు. ఈ పథకంతో పాటుగా స్త్రీ శక్తి భవనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి అయ్యానని కిరణ్ పేర్కొన్నారు. తాను సీఎం అయ్యేటప్పుటికి పేదలు చాలా కష్టాల్లో ఉన్నారనీ, ఒక వైపు తెలంగాణ సమస్య, మరో వైపు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తలెత్తాయని ఆయన తెలిపారు. తాను వచ్చాకే పేదల కోసం పావలా వడ్డీ, మహిళల కోసం ప్రత్యేక పథకాలు, విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియంబర్స్‌మెంటు వంటివి అందేలా చేశానని ఆయన వివరించారు. ఉద్యమాల సమయంలో కూడా చదువులకు ఆటంకం కలగకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకున్నామని సీఎం కిరణ్ వెల్లడించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించక తప్పడం లేదని ఆయన తెలిపారు. "కాంగ్రెస్‌ను ఒకే త్రాటిపై నిలబెట్టే బాధ్యత నాపై ఉంది'' అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సీఎం రూ.18 కోట్లకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles