టీటీడీ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ఇంటి స్థలాలు,దుకాణాలను 2003 లో టీటీడీ స్వాధీనం చేసుకుంది. ఇళ్లు పోగొట్టుకున్న వారికి ప్రత్యామ్నాయంగా తిరపతి శేషాచలనగర్‌లో 186 మందిక ఇళ్లను కేటాయించింది. వీరిలో 90 శాతం మందికి తిరుపతిలో టీటీడీ నిర్మించిన శ్రీదేవి కాంప్లెక్స్‌లో షాపులను కేటాయించారు. మిగిలిన 10 శాతానికి షాపులకు కేటాయించాల్సి ఉంది. అయితే 2009 ఏప్రియల్ సమావేశమైన పాలకమండలి తిరుమలలో నూతనంగా నిర్మించే షాపులను నిర్వాసితులకు కేటాయించాలని తీర్మానించారు. ఇందుకు టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు కూడా అంగీకరించారు.అయితే.. ప్రలోభాలకు లొంగిన టీటీడీ అధికారులు.. నిర్వాసితులకు కేటాయించాల్సిన దుకాణాలను సామాన్యులకు కేటాయించారు. దీంతో నిర్వాసితులు నిరసన వ్యక్తం చేసి కార్యాలయాన్ని ముట్టడించారు. పాలకమండలి తీర్మానాలను తుంగలో తొక్కి అడ్డదారిలో అధికారులు షాపులు వేరేవారికి కేటాయిస్తే.. తమకు ఆత్మహత్యలే శరణ్యమని నిర్వాసితులంటున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more