New scheme for gas consumers

hp gas dealers, hp gas, indian gas, gas consumers, gas connection, bharath gas, oil companies, andhra pradesh, gas dealers, gas, domestic gas, commercial gas, new scheme for gas consumers

new scheme for gas consumers

7.gif

Posted: 01/12/2013 01:12 PM IST
New scheme for gas consumers

ve

        మీ గ్యాస్ డీలర్ సేవలు సవ్యంగా లేవనుకుంటే అయితే సదరు డీలర్‌ను మార్చేసుకోవడం ఇక మీ చేతుల్లో పనే.  అంతేకాదు గ్యాస్ కనెక్షన్ల కోసం కాళ్లరిగేలా తిరిగినా పనికావట్లేదా? బెంగపడొద్దు. ఇక ఆ సేవలూ ఆన్‌లైన్‌లోనే లభ్యం. వినియోగదారులకు మరింత సాధికారితను కల్పించేందుకు, సబ్సిడీ నిర్వహణను మెరుగుపర్చేందుకు, పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 'లక్ష్య' పేరుతో ఒక ప్రాజెక్టును మొదలు పెట్టింది.
      మీ వంటగ్యాస్ పంపిణీదారుడి పట్ల మీరు అసంతృప్తితో ఉంటే మీ కనెక్షన్‌ను మార్చుకోకుండానే పంపిణీదారుడిని మార్చుకోవచ్చు. పంపిణీదారుల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు, వినియోగదారులు తమకు ఇష్టమైన, మెరుగైన సేవలు అందిస్తున్న పంపిణీదారును ఎంపిక చేసుకునేందుకు ఈ సౌకర్యాన్ని అమల్లోకి తెస్తున్నారు. గ్యాస్ డీలర్లనే తప్ప చమురు సంస్థలను మార్చుకోవడం మాత్రం ఈ పథకం ద్వారా సాధ్యపడదు.
         ఉదాహరణకు మీరు ఇండేన్ గ్యాస్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-ఐవోసీ) వినియోగదారుడైతే.. మీ ప్రాంతంలోని ఇండేన్ గ్యాస్ డీలర్లల్లో ఎవరో ఒకరిని మాత్రమే ఎంపిక చేసుకోవచ్చు. అంతే తప్ప భారత్ గ్యాస్(భారత్ పెట్రోలియం)కో, హెచ్‌పీ గ్యాస్‌కో మారే అవకాశం లేదు. దశలవారీగా ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి మొయిలీ విలేఖరులకు చెప్పారు. కాగా ఒక చమురు కంపెనీ నుంచి మరో ఆయిల్ సంస్థకు మారే ప్రక్రియ చట్టపరంగా సాధ్యం కాకపోవచ్చు.
        ప్రస్తుతం వంటగ్యాస్ వినియోగదారుల్లో సగం మంది తమ మొబైల్ ఫోన్ నంబర్లను ప్రభుత్వ చమురు సంస్థలకు అందజేశారు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఆధారం గా పనిచేసే ఒక మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించారు. దీనిని డౌన్‌లోడ్ చేసుకుంటే.. రీఫిల్లింగ్ బుకింగ్, రెండో సిలిండర్ బుకింగ్, ఫిర్యాదులు, సరఫరా చరిత్ర, మరమ్మతు, కనెక్షన్ అప్పగింత, పంపిణీదారుల పనితీరుకు మార్కులు వేయడం వంటివి చేయొచ్చు. అంతేకాదు.. భద్రత, కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు, పథకాల గురించి ప్రభుత్వ చమురు కంపెనీలు కూడా వినియోగదారులకు సమాచారాన్ని ఈ అప్లికేషన్స్ ద్వారా అందిస్తాయి.
      మరో వైపు  కొత్తగా గ్యాస్ కనెక్షన్ పొందేందుకు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వ చమురు సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. త్వరలోనే ఈ సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఇందుకు వినియోగదారులు చేయాల్సిందల్లా.. తమ ఈ-మెయిల్ చిరునామాను పేర్కొంటూ ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తిచేయడమే. కొత్త కనెక్షన్‌ను నిర్ధారిస్తూ అదే ఐడీకి మెయిల్ వస్తుంది. ఆ లేఖ ఆధారంగా, సంబంధిత పత్రాలను తీసుకువెళ్లి పంపిణీ కార్యాలయంలో ఇస్తే కొత్త కనెక్షన్ మంజూరు అవుతుంది.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cold war between ttd officers and staff
Tirumala ghat road accidents  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles