Ttd will be celebrating vaikunta ekadasi festival

TTD will be celebrating Vaikunta Ekadasi Festival

TTD will be celebrating Vaikunta Ekadasi Festival

TTD will be celebrating Vaikunta Ekadasi Festival.png

Posted: 12/22/2012 06:01 PM IST
Ttd will be celebrating vaikunta ekadasi festival

ttdముక్కోటి ఏకాదశి పర్వదినం' తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వీఐపీల తాకిడి అధికం కావటంతో వారికి ఏర్పాట్లు చేయలేక అధికారులు తిప్పులు పడుతున్నారు. ముక్కోటి ఏకాదశి నాడు ఆపద మొక్కలవాడిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించి తరించటాన్ని భక్తులు పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఆ పుణ్యతిధి నాడు దేవదేవుడిని దర్శించుకుంటే మోక్ష ప్రాప్తి లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. ఇందుకుగాను రాష్ట్రం నలు మూలల నుంచే కాకుండా, దేశవ్యాప్తంగా సామాన్య భక్తులతో పాటు వీఐపీలు తిరుమలకు క్యూ కడతారు.

అయితే గత అనుభవాల నేపథ్యంలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత అంటూ చిలుకపలుకులు పలికే టీటీడీ.... ఎప్పటిలాగానే వీఐపీల సేవలో తరించేందుకు తలములకలు అవుతోంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి ఈసారి వీవీఐపీలు పెద్దసంఖ్యలో పోటెత్తుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు తిరుమల విచ్చేస్తున్నారు.అంతే కాకుండా పాసుల కోసం పదివేల అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ఇక ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, చిన్నాచితకా రాజకీయ నాయకుల హడావుడి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శుక్రవారం సాయంత్రానికే తిరుమలకు వీఐపీల తాకిడి ఎక్కువైంది. దాంతో పాసులు, గదుల కోసం టీటీడీ అధికారులపై ఒత్తిడి క్షణక్షణానికీ పెరిగిపోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu conference arrangements
Lord balaji devotees can send offerings by mobile phone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles