Lord venkateswara brahmotsavalu

lord venkateswara brahmotsavalu, tirumala srinivasudu, lord balaji chakrasnanam, seshachala mountains, tirumala tirupathi devastanam, alivelu mangamma dewi,

lord venkateswara brahmotsavalu going on in a big way at tirumala

7.gif

Posted: 10/23/2012 06:00 PM IST
Lord venkateswara brahmotsavalu

srivari_chakra

బ్రహ్మోత్సవాల్లో తుది ఘట్టం శ్రీవారి చక్రస్నానం వైభవంగా ముగిసింది. ఇవాళ మంగళవారం తెల్లవారుజామున స్వామివారి ప్రథమ ఆయుధమైన సుదర్శన చక్రానికి వేద పండితులు పుష్కరిణిలో మూడుసార్లు స్నానమాచరింపజేశారు. ఆ వెంటనే భక్తులంతా గోవిందనామ స్మరణ చేస్తూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. అంతకు ముందు తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై విహరించిన మలయప్ప స్వామి, ఉభయ దేవేరుల విగ్రహాలు, చక్ర పెరుమాళ్లను పుష్కరిణికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో తిరుమంజనం నిర్వహించి స్వామి వారికి ధూపదీపాలతో ఆరాధించారు. తులసీమాలల ధారణ చేసి నక్షత్ర హారతి సమర్పించారు. చక్రస్నాన వీక్షణం- సర్వ పాపహరణం అంటారు. అందుకే ఈ అపూర్వఘట్టాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కరిణికి తరలివచ్చారు. ఈ ఉదయం నాలుగు గంటల నుంచే పుష్కరిణి సమీపంలోకి భక్తులను అనుమతించారు. డీజీపీ దినేష్‌రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
        తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఉదయం చక్రస్నానం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం జరగనున్నాయి. వీటితో తొమ్మిది రోజులపాటు జరిగిన బ్రహ్మోత్సవ సంబరాలు ముగుస్తాయి.    కాగా,  గతంలో కన్నా ఈసారి నిర్వహించిన బ్రహ్మోత్సవంలో భక్తుల సంఖ్య పెరిగిందని టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సారి బ్రహ్మోత్సవాల్లో 4.75 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, 17 లక్షల 20 వేల లడ్డూ విక్రయం జరిగిందని ఆయన తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో 27 టన్నుల పూలను భక్తులు విరాళంగా ఇచ్చారని, 9 రోజుల హుండీ ఆదాయం రూ.12.93 కోట్లని మీడియా సమావేశంలో ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Central minister chiranjeevi service to tirupati
Srivari brahmostavalu garuda vahana seva  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles