పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు వెజిటేబుల్ బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ఆహార పదార్థానికున్న పేరు వింటేనే మనకు అర్థమైపోతోంది... ఇది ఎంత ఆరోగ్యకరమైనదో! వెజిటేబుల్ బిర్యానీలో రకరకాల వెజిటేబుల్స్ కలిగిన కూరగాయలను వేయడం వల్ల విటమిన్స్ శాతం ఎక్కువగా వుంటాయి.
అలాగే మన శరీర శక్తిని పెంపొందించే ఐరన్, ఇతర రసాయనాలు కూరగాయల్లో ఎంతో పుష్కలంగా వుంటాయి కాబట్టి... వెజిటేబుల్ బిర్యానీని ఒక ఆరోగ్యకరమైన వంటకంగా పేర్కొనవచ్చు. దీనిని తయారుచేయడంలో ఎక్కువ మసాలా ఉపయోగించాల్సిన అవసరం కూడా వుండదు.
అరోమా వాసన కలిగిన ఈ ఎక్సొటిక్ రైస్ డిష్.. ఎటువంటి కార్యక్రమాలలోనైనా, వీకెండ్స్ లోనైనా, శుభకార్యాలలోనైనా తయారుచేసుకోవచ్చు. ఈ బిర్యానీని తయారుచేసే విధానం ఎంతో సులభం. పైగా దీనిని తయారుచేయడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు.
కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం (500 గ్రాములు) ; పచ్చిమిరపకాయలు (8 నుంచి 10) ; లవంగాలు (6) ; యాలకలు (3) ;
చెక్క (ఒక ముక్క) ; పలావ్ ఆకు (1) ; పలావ్ పువ్వు (1 లేదా 2) ; జీడిపప్పు (10);
ఉల్లిపాయ (1) ; బీన్స్ ముక్కలు (ఒక కప్పు) ; క్యారెట్ ముక్కలు (ఒక కప్పు) ; పచ్చిబఠాణి (ఒక కప్పు) ;
టొమాటో ముక్కలు (ఒక కప్పు) ; ఆలుగడ్డ ముక్కలు (ఒక కప్పు) ; స్వీట్ కార్న్ (ఒక కప్పు) ;
ఉప్పు (రుచికి తగినంత) ; నెయ్యి (2 టేబుల్ స్పూన్స్)
తయారుచేయు విధానం :
1. ముందుగా తీసుకున్న బియ్యాన్ని నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తరువాత ఒక పెనుమును తీసుకుని స్టౌ మీద కొద్దిసేపు వరకు వేడిచేసుకోవాలి. తరువాత అందులో కొద్దిగా నెయ్యివేసి అందులో జీడిపప్పు, పలావ్ ఆకు, మసాల దినుసులను వేసి బాగా వేయించాలి. అందులోనే పచ్చిమిరపకాయలలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వరకు బాగా వేయించాలి.
3. అలా వేడి చేస్తుండగా.. అందులో వెజిటేబుల్ ముక్కలయిన క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, టొమాటో ముక్కలు, బీన్స్ ముక్కలు ఒకదాని తరువాత ఒకటి కలుపుకోవాలి. అలా కలిపిన తరువాత ఆ పెనుముకు మూతపెట్టి కొద్దిసేపు ఉడికించాలి. అందులో సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి.
4. అలా కొద్దిసేపు వేడిచేసుకున్న తరువాత అందులో కడిగిన బియ్యాన్ని వేసుకోవాలి. అందులో రెండుగ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి.
ఇలా కొద్దిసేపు ఉడికిన తరువాత కిందకు దించితే చాలు.. వెజిటేబుల్ బిర్యానీ మీకోసం రెడీ అయిపోతుంది.
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more