Experts Giving Healthy Tips For Diabetics Patients | Healthy Green Vegetables

Healthy tips for diabetics patients green vegetables

health tips, healthy foods, healthy food items, diabetics problems, diabetics health tips, diabetics diet, diabetics healthy diet, diabetics healthy food items, healthy foods for diabetics, healthy experts

Healthy Tips For Diabetics Patients Green Vegetables : The Health Experts Giving Some Healthy Tips For Diabetics Patients. Those type of people must and should take green vegetables in their diet.

మధుమేహానికి చెక్ పెట్టే హెల్తీ ఆహారం

Posted: 05/08/2015 03:56 PM IST
Healthy tips for diabetics patients green vegetables

మధుమేహం వ్యాధితో బాధపడేవారికి ఇంకా మరెన్నో ఇబ్బందులు తప్పవు. ఆ వ్యాధిగ్రస్తులు ఎన్నో జాగ్రత్తలు పాటించడంతోపాటు నిత్యం ఆరోగ్యకరమైన ఆహారాన్నే సేవించాలని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. అంతేకాదు.. వ్యాయామం కూడా ఎంతో అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడంతోపాటు పోషకాలు నిండిన డైట్‌ను అనుసరించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధుమేహానికి ఆకలి, నోరు ఎండిపోవడం, అలసట, చేతులు, కాళ్ల నొప్పులు వంటివి లక్షణాలు. ఇంకా కంటిచూపు మందగించడం, శరీర బరువు పెరగడం, తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కోపం, మానసిక ఒత్తిడి, చిన్న గాయాలు కూడా మానిపోకుండా చాలారోజులకు అలానే ఉండిపోతాయి.

అయితే సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధుమేహగ్రస్థులు అరటిపూవు, అరటికాడ, క్యాబేజీ, లేత వంకాయలు, బెండ కాయలు, మునగాకు, పొట్లకాయ, దొండకాయ, లేత బీరకాయలు, లేత చిక్కుడు కాయల్ని తీసుకోవచ్చు. అలాగే ఆకుకూరల్లో పొన్నగంటి, తోటకూర, మెంతికూర, కొత్తిమీర వంటివి తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజుకో ఆకుకూర తీసుకోవాలి. ఆకుకూరల్ని కూరగానో లేదా సూప్‌లా తీసుకోవచ్చు. ఆకుకూరల తరుగుతోపాటు కాస్త మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లి, కాసింత పసుపు చేర్చి రెండు గ్లాసుల నీటిలో మరిగించి సూప్‌లా తీసుకోవడం మంతో మేలు చేస్తుంది.

అయితే.. మధుమేహం వ్యాధితో బాధపడేవారు చక్కెర, గ్లూకోజ్, స్వీట్స్, కేక్, చాక్లెట్, ఐస్ క్రీమ్, బెల్లం, బంగాళాదుంప, మామిడి, అరటి పండు, సపోటా, కూల్ డ్రింక్స్ వంటివి ఎప్పటికీ తీసుకోకూడదు. క్యారట్, బీట్ రూట్ నెలకోసారి లేదా రెండుసార్లు తీసుకోవచ్చు. మధుమేహ లక్షణాలుంటేనే వాకింగ్ అలవాటు చేసుకోవడం మంచిదని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. ఈ విధంగా నిపుణులు ఇచ్చిన ఆరోగ్య సలహాలు తూ.చ. తప్పకుండా పాటిస్తే.. ఆ వ్యాధిని చెక్ పెట్టవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : diabetics Health diet  healt tips  Healthy food items  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more