ప్రస్తుత యాంత్రిక జీవినంలో ప్రతిఒక్కరు ఆఫీసు కార్యకలాపాల్లోనే బిజీగా వుండిపోతారు. తద్వారా తమ ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. ఇలా చేస్తే.. ఎన్నోరకాల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అలాకాకుండా నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే తప్పకుండా వ్యాయామం చేయాల్సిందేనని ఆరోగ్య నిపుణలు సలహా ఇస్తున్నారు. ఈ వ్యాయామాలు అనేక రకాలు వుంటాయి. వ్యాయామం ప్రతిరోజూ చేయడం వల్ల ఎముకలు, కండరాల నిర్మాణం, నాడీమండలం, రక్తప్రసరణ వ్యవస్థ ఇలా ప్రతి భాగం ఉత్తేజమవుతూ ఉంటుంది. ఎముకలు, కండరాల బలహీనతలు ఏర్పడడం, అనేక దీర్ఘకాల వ్యాధుల నుంచి రక్షణనిస్తుంది.
అయితే.. ఈ వ్యాయామం చేయడానికి ముందు-తర్వాత తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. ఏరోబిక్స్ వంటి వ్యాయామం చేయడానికి ముందు కనీసం ఐదు నిమిషాలపాటు దేహాన్ని వార్మప్, తర్వాత కూల్ డౌన్ చేసుకోవాలి. వార్మప్ చేయడం వల్ల కండరాలు మృదువుగా కదులుతాయి. కీళ్ల కదలికలు సులువుగా మారుతాయి. చిన్నపాటి కదలికలతో దేహంలో ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగం, రక్తప్రసరణ వేగం పెరుగుతాయి. కండరాలకు సరిపడినంత రక్తం అందడం, దాని వల్ల చిన్నపాటి గాయాలు వాతంటత అవే తగ్గిపోవడం వంటి ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా శరీరంలో అన్ని అవయవాల పనితీరులో సమన్వయం పెరుగుతుంది.
దేహాన్ని స్ట్రెచ్ చేసేటపుడు ఒక్కసారిగా వంచేయకూడదు. నిదానంగా రిలాక్స్ అవుతూ చేయాలి. వార్మప్‌లో భాగంగా దేహాన్ని స్ట్రెచ్ చేసేటపుడు ఒక్కొక్క దశలో పదిహేను సెకన్లు ఉండేటట్లు చూసుకుంటే మంచిది. అలాగే.. స్ట్రెచ్ చేసేటపుడు ఊపిరి బిగపట్టకుండా నిదానంగా గాలి పీల్చుకోవాలి. వ్యాయామం పూర్తయ్యాక కొద్దిసేపు కూల్‌డౌన్ చేయాలి. ఐదారు నిమిషాలపాటు మామూలు వేగంతో వ్యాయామాన్ని ముగించాలి. ఇలా చేయడం వల్ల గుండె వేగం, రక్తప్రసరణ వేగం వంటివన్నీ తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాయి. వార్మప్ చేయడం ఎంత అవసరమో కూల్‌డౌన్ చేయడం కూడా అంతే ముఖ్యం.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more