కంటికి సంబంధించిన సమస్యలను ప్రకృతిలో లభించే కొన్ని సహజ పదార్థాల ద్వారా దూరం చేసుకోవచ్చు. అందులో బాదంపప్పులను ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రతిరోజూ బాదంపప్పులను తీసుకుంటే.. కంటి సమస్యలు దూరమవడంతోపాటు చూపు మెరుగుపడుతుంది. ఎందుకంటే.. ఇందులోకంటికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వుంటాయి. అంతేకాదు.. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను కూడా పెంచుతుంది. అయితే బాదంపప్పులను నేరుగా తీసుకోకూడదు.
రాత్రి సమయంలో 5-10 బాదంలను నీటిలో నానబెట్టాలి. అనంతరం ఉదయం లేవగానే వాటిని పేస్ట్’లా చేసుకోవాలి. మరోవైపు పాలను స్టౌ మీద పెట్టి గోరువెచ్చగా చేయాలి. ఈ పాలల్లో ఇదివరకు పేస్ట్ చేసుకున్న బాదంను వేసి కలియబెట్టాలి. ఈ విధంగా కలిపిన బాదంపాలను ప్రతిరోజూ తాగితే.. కంటిచూపును మెరుగుపర్చుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more