The amazing health benefits with brinjal

brinjal health benefits, health tips, healthy food items, health benefits of brinjal, brinjal nutrients

the amazing health benefits with brinjal which reduces dangerous diseases

వంకాయ.. మానవ ఆరోగ్యానికి దివ్యౌషధం!

Posted: 11/06/2014 03:19 PM IST
The amazing health benefits with brinjal

వంకాయ... సహజంగానే ఇందులో అత్యంత పోషక విలువలు నిల్వవుంటాయి. ఇతర పదార్థాలతో పోల్చుకుంటే వంకాయలోనే మోతాదుకు మించి ఖనిజాలు, విటమిన్లు, ఇంకా ఇతర పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. అందుకే.. దీనిని మానవ  ఆరోగ్యానికి దివ్యౌషధంగా పరిగణిస్తారు. దీనిని ఇప్పటినుంచే కాదు... పురాతనకాలం నుంచి ఆహారపదార్థాలతో వండుకుని తినేవారు. దీని ప్రాముఖ్యత రానురాను వ్యాప్తి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా వున్న అగ్రరాజ్యాలు వంకాయను సాగుచేస్తున్నారు. అంతటి అభివృద్ధి చెందిన ఈ వంకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి అవేమిటో తెలుసకుందాం...

1. గుండె ఆరోగ్యం :  వంకాయలో ఉండే ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B3-B6 యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ వంటి ఇతర పోషకాలు పుష్కలంగా వుంటాయి. ఇవి స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా పోటాషియం శరీరంలో హైడ్రేట్లు, ద్రవాలు నిలువను తొలగించి.. గుండె వ్యాధులను నిరోధిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫుతో న్యూట్రియంట్స్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి... రక్త ప్రవాహాన్ని మెరుగుపరచటానికి సహాయపడుతుంది.

2. మెదడు ఆరోగ్యం : వంకాయలో వుండే ఫోటో న్యూట్రియంట్స్ అనేవి ఫ్రీ రాడికల్, ఆక్సీకరణ ఒత్తిడి నష్టం నుండి కణత్వచంను రక్షిస్తాయి. నాడీ చర్య సులభతరం, షార్ప్ మెమరీ విధులు ఉంటాయి. B కాంప్లెక్స్ విటమిన్లు ఒత్తిడి లేకుండా విధులను నిర్వహిస్తాయి.

3. బరువు తగ్గడం : వంకాయలో అధిక నీరు, తక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే ఇందులో పైబర్ ఎక్కువగా ఉండుట వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది... విష వ్యర్థాలను తొలగిస్తుంది... జీవక్రియ విరుగుడుగా అధిక వేగంతో కేలరీలును బర్న్ చేస్తుంది.

4.  పైల్స్ చికిత్స : వంకాయ తల (పైన ఉన్నఆకుపచ్చ) దీర్ఘ కాల పైల్స్, హేమరాయిడ్స్(పురీషనాళం యొక్క సిరలు) చికిత్స కోసం ప్రాచీన సంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు.

5. జుట్టు సంరక్షణ : వంకాయలో మినరల్స్, విటమిన్లు, నీరుశాతం అధిక మోతాదులో వుండటం వల్ల తలపైనున్న చర్మానికి లోతుగా పోషణను అందిస్తుంది. జుట్టు చివరల చీలికలను నిరోదిస్తుంది... జుట్టును ఆరోగ్యంగా బలంగా ఉంచుతుంది.

6. శరీర దుర్వాసనను నివారిస్తుంది : వంకాయలను బాగా పిండి రసాన్ని తయారుచేసుకోవాలి. ఆ రసాన్ని అరచేతులు, అరికాళ్ళకు రాసుకుంటే చాలా మంచిది. అలాగే దుర్వాసన వచ్చే ప్రదేశాల్లో రాసుకుని, కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే వాసన పోతుంది.

7. కోలన్ క్యాన్సర్ నివారణ : వంకాయలో ఉండే ఫైబర్ శరీరంలో వుండే విష రసాయనాలను పీల్చుకుని.. పెద్దప్రేగు కాన్సర్ ప్రమాదంను తగ్గిస్తుంది. అలాగే ఇందులో వుండే యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు, చ్లోరోగేనిక్ యాసిడ్ వంటివి శరీరంలో ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తాయి. క్యాన్సర్ కణాలు ఆహారం పెరుగుదల మరియు రక్త నాళాల పెరుగుదలను నివారిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more