The healthy benefits of ginger tea

ginger health benefits, ginger tea, ginger tea making, making of ginger tea, health tips, health benefits ginger tea, ginger tea health, ginger tea news, health home remedies

the healthy benefits of ginger tea which improves immunity

‘‘అల్లం-టీ’’తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

Posted: 11/05/2014 05:04 PM IST
The healthy benefits of ginger tea

మానవశరీరానికి కావలసిన ఔషధాలు ‘‘అల్లం’’లో పుష్కలంగా వుంటాయి. దీని ద్వారా తయారుచేసుకున్న టీని ప్రతిరోజూ సమయానుకూలంగా తాగితే అజీర్ణం, వాపు, మైగ్రేన్లు, విరేచనాలు వంటివాటితోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. దీనిని కేవలం ఇండియాలోనేకాదు.. ప్రపంచవ్యాప్తంగా ఒక దివ్యౌషధంగా దీనిని ఉపయోగిస్తారు. 3000 సంవత్సరాల పురాతన చైనీస్ మందులలో దీనిని ఉపయోగిస్తున్నారంటే.. అల్లం ఆరోగ్యానికి ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. దీనిని ఆయుర్వేదంలో కూడా వాడుతారు. అల్లంలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు B6, సి సమృద్ధిగా లభ్యమవుతాయి కాబట్టి.. శరీరంలో శక్తిని పెంచేందుకు ఇవి ఉపయోగపడుతాయి. అటువంటి అల్లంను టీ లో కలుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి అవేమిటో తెలుసుకుందాం...

1. వికారం నుంచి ఉపశమనం : కొంతమందికి ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా సాధారణ సమయాల్లో అప్పుడప్పుడు వికారం వస్తున్నట్లుగా వుంటుంది. అలాంటప్పుడు అల్లం టీ ఒక కప్పు త్రాగితే ఎంతో శ్రేయస్కరం.

2. జీర్ణక్రియ అభివృద్ధి : జీర్ణక్రియ అభివృద్ధి, ఆహార శోషణ పెంచటానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే... కడుపు సమస్యను చాలా త్వరగా నివారిస్తుంది. భోజనం చేసిన తర్వాత వచ్చే అల్లం టీ తాగితే.. వచ్చే ఉబ్బరంను తగ్గిస్తుంది.

3. నొప్పి తగ్గిస్తుంది : అల్లంలో శోథ నిరోధక లక్షణాలు వుండటంవల్ల కండరాలు, కీళ్ళ సమస్యలకు ఒక ఆదర్శవంతమైన గృహ వైద్యంగా పనిచేస్తుంది.

4. శ్వాసకోశ సమస్యను తగ్గిస్తుంది : అల్లం టీ జలుబు రద్దీని తగ్గించటానికి సహాయపడుతుంది.

5. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది : అల్లం టీలో ఉన్న విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు రక్త ప్రసరణ మెరుగుపరచడంతోపాటు పునరుద్ధరించడానికి సహాయపడుతాయి. అలాగు గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలను నివారించడానికి ధమనులలో ఉండే కొవ్వును నిరోధించటానికి అల్లం సహాయం చేస్తుంది.

6. రోగనిరోధక శక్తి పెరుగుతుంది : అల్లంలో అధిక స్థాయిలో అనామ్లజనకాలు ఉండుట వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం చేయటానికి సహాయపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ginger tea  health tips  the health problems  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more