Healthy foods for weight loss

healthy foods, healthy tips, health tips for weight loss, health tips weight loss, weight loss tips

the healthy food items which helps to loss body weight

త్వరగా బరువును తగ్గించుకునే అద్భుత మార్గాలు

Posted: 09/24/2014 05:52 PM IST
Healthy foods for weight loss

(Image source from: the healthy food items which helps to loss body weight)

ప్రస్తుతం సాంకేతిక రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అనేకరకాల వ్యాధులబారిన పడుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ కష్టం లేకుండా ఒకేచోట కూర్చొని పనిచేయాల్సి వుంటుంది కాబట్టి.. ప్రతిఒక్కరికీ బొజ్జ సమస్య ఎక్కువైపోతోంది. ఆరోగ్య సూత్రాలను పాటించినప్పటికీ.. క్రమక్రమంగా వారి శరీర బరువు మాత్రం పెరుగుతూనే వుంటుంది. అలాగే వాతావరణ పరిస్థితులు కూడా శరీర ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావాన్నిచూపుతాయి. దీంతో మనకు తెలియకుండానే శరీరంలో అదనపు కొవ్వు కూడా చేరడంతో బరువు పెరడం జరుగుతుంది. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే సింపుల్ గా ఇంట్లోనే కొన్ని పద్ధతులను పాటిస్తే.. తక్కువ సమయంలోనే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

1. వ్యాయామం : ఉదయం, సాయంత్రంవేళలో ప్రతిరోజూ గంటసేపు వరకు వ్యాయామం చేస్తే.. శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వు క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఫలితంగా శరీర బరువు వేగంగా తగ్గడానికి వీలుగా వుంటుంది.

2. భోజనం : చాలామంది రాత్రి సమయంలో డిన్నర్ చాలా ఆలస్యంగా చేస్తుంటారు. చేసిన వెంటనే ఠపీమని త్వరగా నిద్రపోతారు. ఇలా చేస్తే ఆరోగ్యం త్వరగా పాడవుతుంది.. అలాగే శరీర బరువు కూడా పెరిగిపోతుంది. కాబట్టి.. ఇలా కాకుండా సాధ్యమైనంత త్వరగా రాత్రి సమయంలో భోజనం ముగించడం మంచిది.

3. పంచదార మోతాదు : చక్కెరలో కేలరీలు చాలా ఎక్కువగా వుంటాయి. ఎక్కువ కేలరీలు వున్న పదార్థాలను తీసుకుంటే.. శరీరం వాటిని గ్రహించే బరువును పెంచుతుంది. తద్వారా చక్కెర తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది.

4. డిజర్ట్స్ : సాధారణంగా కొంతమంది డిన్నర్ కు ముందు స్నాక్స్, డిజర్ట్స్, పిజ్జాస్, బర్గర్ వంటివి సేవిస్తుంటారు. వాటిలో కేలరీలు ఎక్కువ మోతాదులో వుంటాయి. అవి శరీర బరువును పెంచడంతోపాటు అనారోగ్యానికి దారితీస్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా వాటిని మానుకోవడం మంచిది.

5. ప్రోటీన్లు : కేలరీలు ఎక్కువగా వుండే ఆహారపదార్థాలను తీసుకోవడం కంటే ప్రోటీన్లు ఎక్కువగా వుంటే వాటిని తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి శక్తినివ్వడంతోపాటు బరువును అదుపులో వుంచుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  weight loss tips  healthy food items  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more