Financial guide for children

Financial Guide for Children, tips for children, finance tips for children

Financial Guide for Children, tips for children, finance tips for children

మీ పిల్లలకు ఆర్థిక గురువులు మీరే

Posted: 12/13/2013 03:56 PM IST
Financial guide for children

పొదుపు అనేది ఒక స్వభావం. దాన్ని బాల్యం నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. ఫైనాన్సియల్ ప్లానింగ్‌ను తల్లిదండ్రులే నేర్పించాలి. డబ్బుకున్న విలువను పిల్లలు గుర్తించినప్పుడే శ్రమ విలువ తెలుస్తుంది. శ్రమను గౌరవించడమంటే మనుషుల్ని గౌరవించడం అన్న మాట'' అంటున్నారు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్‌బఫెట్. చిన్నపిల్లల్లో పొదుపును ఒక హాబిట్‌గా చేయాలనేది ఆయన ఆలోచన. ఇందుకు ఏం చేయాలంటే- వీలున్నప్పుడు మీ పిల్లలకు ఒక చిన్న పిగ్గీబాక్స్‌ను కొనిపెట్టండి.

అప్పుడప్పుడు మీరిచ్చే పాకెట్‌మనీలో కొంత మొత్తాన్ని ఆ పిగ్గీబాక్స్‌లో దాచుకోమనండి. పదిరూపాయలు దాచుకుంటే దానికి మరో పది జత చేస్తామని హామీ ఇవ్వండి. నెలకో, రెన్నెళ్లకో పిగ్గీబాక్స్ నిండిపోయాక.. అందులోని సొమ్మును స్వయంగా పిల్లలతోనే లెక్కవేయిస్తే మంచిది. కుటుంబసభ్యులందరి మధ్య పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఈ పని చేస్తే బాగుంటుంది. వీలైతే - పిల్లలు డబ్బును లెక్కపెట్టే దృశ్యాలను వీడియో తీసి.. చిన్న సెలబ్రేషన్ వాతావరణాన్ని సృష్టిస్తే మరీ మంచిది.

రూపాయి రూపాయి కూడబెడితే ఎంత పెద్ద మొత్తం అవుతుందో వారికి చెప్పడానికే ఇదంతా. క్రమశిక్షణతో పొదుపు చేసినందుకు ఇంటిల్లిపాదీ అభినందించండి. మరొక రోజు పిల్లల్ని తీసుకుని కుటుంబంతో సహా బ్యాంకుకు వెళ్లండి. అక్కడ పిల్లల పేరుతోనే ఒక చిన్న ఖాతా తెరిచి.. పిగ్గీబాక్స్‌లో దాచుకున్న మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయండి. ఆ మొత్తానికి మీరు కూడా మరికొంత మొత్తం కలిపితే.. కాంప్లిమెంటరీ అందుకుంటున్నట్లు పిల్లలు ఆనందిస్తారు.

పిల్లల పేరున తీసిన బ్యాంకు ఖాతాలో జమ చేసిన సొమ్మును చూశాక.. వారిలో ఆర్థిక ఆత్మవిశ్వాసం మొగ్గతొడుగుతుంది. జీవితాంతం ఇదొక తీపిగుర్తుగా, తల్లిదండ్రులు నేర్పిన పొదుపు పాఠంగా తప్పక గుర్తుండిపోతుంది. ఆ తర్వాత పొదుపు సర్టిఫికెట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్‌ఫండ్లు, ఇన్స్యూరెన్స్.. వంటి అంశాలన్నీ వివరిస్తే మరింత చైతన్యం వస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Gold loan is better than personal loan

    పర్సనల్ లోన్ కంటే గోల్డ్ లోనే ఎంతో శ్రేయస్కరం!

    Jun 13 | బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా... Read more

  • Credit cards using tips

    క్రెడిట్ కార్డులను ఎలా ఉపయోగిస్తున్నారు..?

    Apr 25 | ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి... Read more

  • Financial tips to save money

    ఆర్థికంగా వృద్ధి చెందాలంటే.. ఖర్చులు అదుపులో వుంచాలి!

    Apr 22 | ‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం.  ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల... Read more

  • Tips to save money for better future

    ఉజ్వల భవిష్యత్ కోసం.. ఇఫ్పుడే ప్రణాళికలు చేసుకోండి!

    Apr 07 | ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక... Read more

  • Tips to save salary money

    మీ కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్నారా?

    Apr 02 | ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు.  అయితే వీరు చాలా విషయాలలో... Read more