బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా ఈ బంగారం ప్రత్యేకత గురించి వివరించబడి వుంది. ఇక మహిళలైతే బంగారం అంటేనే పడిచస్తారు. ఏవైనా పండుగలు గానీ, శుభకార్యాలు గానీ వస్తే చాలు... మహిళలు తమను తాము బంగారంతో అలంకరించుకుంటారు. ఇటువంటి విషయాలన్నీ పక్కకు పెడితే... బంగారం కేవలం అలంకరణలోనే కాకుండా ఆర్థిక అవసరాలలో కూడా ప్రముఖపాత్రను పోషిస్తుంది.
ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైనా ఎదురయినప్పుడు చాలామంది బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ రూపంలో సహాయం తీసుకుంటారు. అయితే అవే బ్యాంకు రంగాలవారు మాత్రం పర్సనల్ లోక్ కంటే గోల్డ్ లోనే ఎంతో మేలని అభివర్ణిస్తున్నారు. అదెలా అంటే... సాధారణంగా కష్టాలు ఏ ఒక్కరికి తలుపు తట్టి రావు. అటువంటి కష్టసమయాల్లో మనం బ్యాంకుల్లో వివిధ పథకాల రూపంలో ఆదా చేసుకున్న డబ్బును తీసుకోవాలన్నా... దాని ప్రాసెసింగ్ కు కొంత సమయం పడుతుంది. ఒకవేళ అది మ్యూచువల్ ఫండ్ అయితే కనీసం రెండు రోజులవరకు డబ్బులు చేతికి అందడానికి సమయం పడుతుంది. అదీకాకుండా చిట్ పాడితే... నెల తర్వాత వరకు గానీ అస్సలు డబ్బులు అందవు. ఈ నేపథ్యంలో అప్పటికప్పుడే మనకు డబ్బు కావాలంటే అది బంగారంతో సాధ్యం అవుతుందని నిపుణులు అంటున్నారు.
ఎందుకంటే.. పర్సనల్ లోన్ కంటే గోల్డ్ లోన్ ను అంత పెద్ద ప్రాసెస్ వుండదు. అదే ఇందులో వున్న ప్లస్ పాయింట్. మనం బంగారం ఇచ్చిన వెంటనే వారు దాని బరువు, క్వాలిటీని చూసుకొని... వాటికి సంబంధించిన కాగితాలను నింపుతారు. అంతే... ఈ ప్రాసెస్ మొత్తం కేవలం రెండు లేదా మూడు గంటల్లో పూర్తయిపోతుంది. కాబట్టి మనకు అప్పటికప్పుడే చేతికి డబ్బులు అందుతాయి. అంతేకాకుండా గోల్డ్ లోన్ కోసం ఎవరీ ష్యూరిటీ అవసరం వుండదు. పైగా ఈ మొత్తం ప్రాసెసింగ్ ఫీజు కూడా కేవలం ఒక్క శాతం మాత్రమే వుంటుంది.
ఒకవేళ గోల్డ్ లోన్ కాకుండా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే... దానికంటే ముందు మనం ఇంతకుముందు తీసుకున్న లోన్లు, వాటిని తిరిగి చెల్లించిన తీరుతెన్నులు వంటివన్నీ బ్యాంకులకు పక్కాగా చూయించాల్సి వుంటుంది. సిబిల్ స్కోరు లాంటి వాటిని కూడా దీనికోసం పరిశీలిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి కనీసం మూడురోజుల వరకు సమయం పడుతుంది. ఈ పర్సనల్ లోన్ కి కొన్ని నియమ, నిబంధనలు కూడా వుంటాయి. ఈ లోన్ ను తీసుకోవడానికి ముందు మనం సరిగ్గా తిరిగి చెల్లిస్తామని చెబుతూ ఒక ష్యూరిటీ సంతకాన్ని చేయాల్సి వుంటుంది. అలాగే మనకు సంవత్సరానికి వచ్చే ఇన్ కం ఎంతో వారికి సాక్ష్యాధారాలతో సహా చూయించి, వాటిని అప్లికేషన్ కి జత చేయాల్సి వుంటుంది. ఇలా ఈ విధంగా జరిగిన మొత్తం ప్రాసెస్ తరువాత పర్సనల్ లోన్ అప్లై అవుతుంది.
కాబట్టి గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ మధ్య ఇటువంటి వ్యత్యాసాలు వుండటం వల్ల చాలామంది పర్సనల్ కంటే గోల్డ్ లోన్ తీసుకోవడంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గోల్డ్ లోన్ ఎవరి సహాయం, రికమెండేషన్లు లేకుండా నేరుగా అప్లై చేసుకోవచ్చు. అతి తక్కువ సమయంలో మొత్తం ప్రాసెస్ పూర్వవ్వడమే కాకుండా అప్పటికప్పుడే మనకు డబ్బులు అందుతాయి. వీటితోపాటు గోల్డ్ లోన్ తో కలిగే మరికొన్ని ప్రయోజనాలు...
1. గోల్డ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు కేవలం 1 శాతం మాత్రమే అయితే పర్సలోన్ లోన్ కు మాత్రం అదే ప్రాసెసింగ్ ఫీజు రెండు మూడు శాతం వరకు వుంటుంది.
2. బ్యాంకులను బట్టి గోల్డ్ లోన్ కు 10 నుంచి 13 శాతం వరకు వడ్డీ వుంటుంది. అదే పర్సనల్ లోన్ కు అయితే మన క్రెడిట్ కార్డు స్కోరు ఆధారంగా 16 నుంచి 22 శాతం వరకు వడ్డీని నిర్ధారిస్తారు.
3. గోల్డ్ లోన్ లో తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించడానికి ఒక సంవత్సరం వరకు గడువు లభిస్తుంది. ఒకవేళ ఆ సమయంలో తిరిగి చెల్లించకలేకపోతే... గడువును మరికొంతకాలం వరకు పొడిగించుకోవచ్చు. ఈ ప్రీపేమెంట్ కి పెనాల్టీ కూడా ఒక్క శాతం మాత్రమే పడుతుంది. అదే పర్సనల్ లోన్ లో అయితే తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించడానికి రెండు నుండు మూడు సంవత్సరాల వరకు గడువు వుంటుంది. దీని ప్రీపేమెంట్ కు మాత్రం 2 నుంచి 3 శాతం వరకు పెనాల్టీని చెల్లించుకోవాల్సి వుంటుంది.
ఈ మొత్తం కథనం ఆధారంగా ముఖ్యమైన విషయం తెలిసేదేమిటంటే.. గోల్డ్ లోన్ మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడటమే కాకుండా అన్ని విధాలుగా చాలా సులభంగా వుంటుంది. ఒకవేళ మనం బ్యాంకులకు గోల్డ్ లోన్ మీద తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకపోతే.. బ్యాంకులు ఆ బంగారాన్ని అమ్ముకుంటాయి. అందుకే బ్యాంకులు గోల్డ్ లోన్ పై ఎటువంటి నియమనిబంధనలను ఏర్పరచదు.
(And get your daily news straight to your inbox)
Apr 25 | ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి... Read more
Apr 22 | ‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం. ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల... Read more
Apr 07 | ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక... Read more
Apr 02 | ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు. అయితే వీరు చాలా విషయాలలో... Read more
Mar 22 | ప్రస్తుతకాలంలో యువతీయువకులు సంపాదిస్తున్న కష్టార్జితాన్ని అనవసరమైన ఖర్చులకు అంటగడుతున్నారు. తమ భవిష్యత్ కోసం ఉపయోగపడే ఆర్థిక ప్రణాళికలను, లక్ష్యాలను, పథకాలను నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. తమకు వచ్చే జీతంలో మిగిలిన డబ్బులను దాచుకోకుండా ఖర్చులు చేసిపడే్స్తున్నారు.... Read more