Heavy Weight Can Decreasy By Drinking Soups Everyday | Health Tips | Home Remedies | Best Healthy Soups

Heavy weight decrease tips soup specials home remedies

obesity tips, obesity health tips, best healthy soups, healthy soups, soups for obesity, obesity soups tips, drinking soups, heavy weight decrease remedies, soups cooking tips

Heavy Weight Decrease Tips Soup Specials Home Remedies : Experts Saying That Heavy Weight Can Decreasy By Drinking Soups Everyday.

బరువు తగ్గాలా.. అయితే సూప్ తాగండి!

Posted: 09/15/2015 11:07 AM IST
Heavy weight decrease tips soup specials home remedies

ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్నవారు సన్నాబడాలని నానారకాలుగా ప్రయత్నిస్తుంటారు. తరచూ వ్యాయామాలు చేయడంతోపాటు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట తీసుకోవడం మానేస్తారు. అలాగే.. మధ్యాహ్న, రాత్రివేళ భోజనంలో చాలా తక్కువగా తీసుకుంటారు. అయితే.. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం కాదు కదా.. ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉదయం టిఫిన్ తీసుకోవడం పోవడం వల్ల శరీరం చురుగ్గా వుండకపోవడమే కాకుండా మధ్యాహ్నం మరింత ఎక్కువ ఆహారం తీసుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి.. ఉదయం టిఫిన్ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టిఫిన్‌లో తృణధాన్యాలూ, తేనె, బాదం, పెరుగు లాంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కానీ.. కెలొరీలు తక్కువగా ఉండాలంటే ఉడికించినవి ఎంచుకోవాలని చెబుతున్నారు.

ఇక మరొక విధానం ఏమిటంటే.. రెగ్యులర్ గా సూప్ తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. భోజనానికి ముందు సూప్ తీసుకోవడం వల్ల ఇరవై శాతం కెలొరీలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సూప్ తాగడం రోజువారీ అలవాటుగా మార్చుకోవాలి. అలాగే కొవ్వు తగ్గడానికి ప్రొటీన్లు ఎక్కువగా వుండే ఆహారం కూడా ఎంతో మేలు చేస్తుంది కాబట్టి వాటి మోతాదును పెంచి, పిండి పదార్థాలను తగ్గించాలి. పండ్లూ, కూరగాయలూ ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి పీచు అందుతుంది. ఇది అధిక కొవ్వుని శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. దాంతోపాటు విటమిన్లూ, ఖనిజాలూ శరీరానికి అందుతాయి. అందుకే.. రోజువారి ఆహారంలో పోషక విలువలు ఎక్కువగా నిల్వవుండే పండ్లను, కూరగాయలూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.

కేవలం సూప్ తీసుకోవడమే కాదు.. తరుచూ నీళ్లు ఎక్కువగా తాగడం అలవాటుగా మార్చుకోవాలని చెబుతున్నారు. ఒకవేళ నీళ్లు తాగడం ఇబ్బందిగా అనుకునేవారు ‘లెమన్ టీ‌’లో చక్కెర తక్కువగా వేసుకుని తాగాలి. సన్నగా మారేందుకు వేళకు నిద్రపోవడం కూడా అవసరమే కాబట్టి ఎన్ని పనులున్నా కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఈ చిట్కాలు తరచూ పాటిస్తే.. అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obesity health tips  healthy soups  heavy weight decrease tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more