స్వామి వారి పూజలు

స్వామి వారి పూజలు

శ్రీ వైఖానస భగవఛ్ఛాస్త్రోక్త మార్గాన్ననుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. దీనినే ఆగమ పరిభాష లో షట్కాల పూజ అని అంటారు. అవి... ప్రత్యూష, ప్రాత:కాలం, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది.

సుప్రభాత సేవ :  నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది.

శుద్ధి : సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది.

తోమాలసేవ : ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత రెండవ సారి మరల తోమాలసేవ చేస్తారు. తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు స్నపన మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్‌ జరుగుతుంది. దీనినే శ్రీ వైఖానస భగవచ్చాస్త్రం లో 'యాత్రాసనం' అని కూడా అంటారు.

సహస్రనామార్చన: ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి 1008 నామాలనూ స్తుతిస్తూ తులసి దళాలతో చేసే అర్చన ఇది.

మొదటిగంట, నైవేద్యం : మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి)కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.

అష్టోత్తర శతనామార్చన : ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణం లో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు.

రెండో గంట, నైవేద్యం : అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట నైవేద్యం జరుగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.

రాత్రి కైంకర్యాలు : ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది.

ఏకాంతసేవ : రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు బ్రహ్మది దేవతలు వస్తారని ప్రతీతి. బ్రహ్మది దేవతలు స్వామి వారి ఆరాధన చేయడం కోసం తగినంత నీటిని బంగారు పంచ పాత్రల లో ఉంచుతారు. వారు ఆరాధన చేసిన తీర్ధాన్ని మరుసటి రోజు సుప్రభాతం ముగిసిన తర్వాత భక్తులకు తీర్ధంగా ఇస్తారు. ఏడుకొండలస్వామి పవళింపుసేవ లో అన్నమయ్య లాలి సంకీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు. దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.

ముత్యాల హారతి : ఉత్తర మాడా వీధి లో నివసించేతరిగొండ వెంగమాంబ అనే మహాభక్తురాలు హారతి తీసుకోనిదే బ్రహ్మోత్సవాల సమయం లో ఆమె ఇంటి ముందు నుండి కదలని రథానికి గుర్తుగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబ ని పాట పాడి హారతి ని ఇమ్మని భక్తులూ,అర్చకులూ అడిగేవారట కాలక్రమం లో అది ఒక సేవగా స్థిరపడిపోయింది.ఈ సేవనే'తరిగొండ ముత్యాల హారతి'అనేవారు.వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది.అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.

గుడిమూసే ప్రక్రియ : రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు.

ప్రత్యేక సేవలు :

రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమలవాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి..
1. సోమవారం విశేషపూజ
2. మంగళవారం అష్టదళ పాద పద్మారాధన
3. గురువారం సడలింపు నేత్ర దర్శనం,తిరుప్పావడ, సాయంత్రం పూలంగిసేవ
4. శుక్రవారం అభిషేకం.

స్వామికి రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం, సహస్రదీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత వసంతోత్సవం ఇవన్నీ ఉత్సవమూర్తులకు ప్రతి నిత్యం జరిగేవి.

  Dharhan times
Sthala puranam  
Rate This Article
(2 votes)
Tags : tirumala sri venkateswara swamy temple information  

Other Articles

 • Air port

  Mar 15 | విమాన మార్గం తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట, తిరుమలకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి.... Read more

 • Railway station

  Mar 15 | రైలు మార్గం తిరుమలకు దగ్గరిలోని రైల్వే స్టేషనున్న తిరుపతికి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. రైల్వేస్టేషన్ నుంచి కొండమీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతోంది. ముందుగానే దర్శన టిక్కెట్లు,... Read more

 • Bus station

  Mar 15 | దేశంలోని అన్నిప్రాంతాల నుండి తిరుపతికి వెళ్లేందుకు అనువైన రోడ్డు మార్గం కలదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆర్.టి.సి బస్సు సౌకర్యం కలదు. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో భక్తులకు అనువుగా వుండేందుకు ప్రభుత్వాలు మరిన్ని... Read more

 • Dharhan times

  Mar 15 | సర్వదర్శనం : సాధారణ రోజుల్లో స్వామివారిని దర్శించుకోవడం కోసం 18 గంటలవరకు సమయం కేటాయిస్తారు. రద్దీ ఎక్కువగా వున్న రోజుల్లో 20 గంటలకు పెంచుతారు. స్పెషల్ దర్శనం : ఈ ఆలయంలో స్పెషల్ దర్శనం... Read more

 • Sthala puranam

  Mar 15 | కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని ‘భవిష్యోత్తర పురాణం’లోని ఓ కథనం వుంది. తిరుమల వేంకటేశ్వరుని ‘శ్రీనివాసుడు, బాలాజీ’ అని కూడా పిలుస్తారు. మొట్టమొదటగా.. వైఖానస అర్చకుడు... Read more